త్వరలో పాకిస్థాన్‌లో అమెరికా, ఇరాన్ చర్చలు
ABN , Publish Date - Mar 30 , 2026 | 04:26 AM
అమెరికా, ఇరాన్ యుద్ధం ముగింపు దిశగా దౌత్య ప్రయత్నాలు విజయవంతంగా సాగుతున్నాయని పాకిస్థాన్ విదేశాంగ మంత్రి ఇషాక్ దార్ వెల్లడించారు.
పాక్ విదేశాంగ మంత్రి ఇషాక్ దార్
ఇస్లామాబాద్, మార్చి 29: అమెరికా, ఇరాన్ యుద్ధం ముగింపు దిశగా దౌత్య ప్రయత్నాలు విజయవంతంగా సాగుతున్నాయని పాకిస్థాన్ విదేశాంగ మంత్రి ఇషాక్ దార్ వెల్లడించారు. ఆదివారం ఇస్లామాబాద్‌లో ఈజిప్ట్, సౌదీ, తుర్కియే మంత్రులతో భేటీ అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. సోమవారం మరోసారి సమావేశమై చర్చించనున్నట్టు తెలిపారు. త్వరలోనే ఇస్లామాబాద్ వేదికగా అమెరికా, ఇరాన్ మధ్య చర్చలు జరగనున్నాయని వెల్లడించారు. దౌత్య ప్రయత్నాల అంశంలో పాకిస్థాన్‌పై అమెరికా, ఇరాన్ విశ్వాసం ఉంచడంపై ఇషాక్ దార్ సంతోషం వ్యక్తం చేశారు.