Denmark PM Mette Frederiksen: అమెరికా గ్రీన్‌లాండ్‌ను స్వాధీనం చేసుకుంటే నాటో కథ ముగిసినట్లే!
ABN , Publish Date - Jan 07 , 2026 | 02:30 AM
అమెరికా గ్రీన్‌లాండ్‌ను బలవంతంగా స్వాధీనం చేసుకోవాలని చూస్తే, అది ‘నాటో’ కూటమి అంతానికి దారితీస్తుందని డెన్మార్క్ ప్రధాని మెటె ఫ్రెడెరిక్సన్ స్పష్టం చేశారు.
డెన్మార్క్ ప్రధాని సంచలఅమెరికా గ్రీన్‌లాండ్‌ను స్వాధీనం చేసుకుంటే నాటో కథ ముగిసినట్లే!
డెన్మార్క్ ప్రధాని సంచలన వ్యాఖ్యలు
బెర్లిన్, జనవరి 6: అమెరికా గ్రీన్‌లాండ్‌ను బలవంతంగా స్వాధీనం చేసుకోవాలని చూస్తే, అది ‘నాటో’ కూటమి అంతానికి దారితీస్తుందని డెన్మార్క్ ప్రధాని మెటె ఫ్రెడెరిక్సన్ స్పష్టం చేశారు. ఒక సభ్య దేశంపై మరో సభ్య దేశమే దాడికి దిగితే ప్రపంచ భద్రతా వ్యవస్థే కుప్పకూలుతుందని ఆమె హెచ్చరించారు. ‘‘అమెరికా ఒకవేళ నాటోలోని తోటి దేశంపై సైనిక దాడికి దిగితే, అంతటితో అంతా ముగిసినట్లే. రెండో ప్రపంచ యుద్ధం ముగిసినప్పటి నుంచి మనకు రక్షణగా ఉన్న నాటో కూటమి ఆ క్షణమే కనుమరుగవుతుంది’’ అని మెటె పేర్కొన్నారు. గ్రీన్‌లాండ్‌పై ట్రంప్ చేస్తున్న వ్యాఖ్యలు ఒక ప్రాంతం గురించి మాత్రమే కాకుండా, అంతర్జాతీయ శాంతి ఒప్పందాలనే ప్రశ్నార్థకం చేస్తున్నాయని ఆమె ఆందోళన వ్యక్తం చేశారు. ‘‘మరో 20 రోజుల్లో గ్రీన్‌లాండ్ విషయం తేలుస్తా’’ అన్న ట్రంప్ వ్యాఖ్యలపై ఆమె ఈ వ్యాఖ్యలు చేశారు. డెన్మార్క్ వాదనకు ఫ్రాన్స్, జర్మనీ, ఇటలీ, పోలాండ్, స్పెయిన్, బ్రిటన్ దేశాలు పూర్తి మద్దతు ప్రకటించాయి. ఫ్రాన్స్ అధ్యక్షుడు మెక్రాన్, బ్రిటన్ ప్రధాని కైర్ స్టార్మర్ సహా పలువురు ఐరోపా నేతలు మంగళవారం ఒక ఉమ్మడి ప్రకటన విడుదల చేస్తూ.. గ్రీన్‌లాండ్ ఎవరి సొత్తు కాదని, అక్కడి ఖనిజ సంపద ఆ భూభాగం ప్రజలకే చెందుతుందని తేల్చి చెప్పారు.