Thailand: కదులుతున్న రైలుపై కూలిన క్రేన్..31మంది మృతి
ABN , Publish Date - Jan 15 , 2026 | 04:59 AM
థాయ్‌లాండ్‌లో ఘోర రైలు ప్రమాదం చోటుచేసుకుంది. రైల్వే వంతెన నిర్మాణంలో ఉపయోగిస్తున్న భారీ క్రేన్..
థాయ్‌లాండ్‌లో ఘోర ప్రమాదం
బ్యాంకాక్, జనవరి 14: థాయ్‌లాండ్‌లో ఘోర రైలు ప్రమాదం చోటుచేసుకుంది. రైల్వే వంతెన నిర్మాణంలో ఉపయోగిస్తున్న భారీ క్రేన్.. అటుగా వెళ్తున్న ప్యాసింజర్ ట్రైన్‌పై కుప్పకూలడంతో 31మంది ప్రాణాలు కోల్పోయారు. మరో 64మంది తీవ్రంగా గాయపడ్డారు. చైనాను దక్షిణాసియాలోని ప్రధాన దేశాలతో అనుసంధానించే ప్రతిష్ఠాత్మక హైస్పీడ్ రైల్వే ప్రాజెక్టు జరుగుతున్న ప్రాంతంలో బుధవారం ఉదయం ఈ ప్రమాదం జరిగింది. రైల్వే నిర్మాణ పనుల్లో భాగంగా ఉన్న ఓ భారీ క్రేన్.. బ్యాంకాక్ నుంచి ఉబోన్ రాచథాని ప్రావిన్సుకు వెళ్తున్న రైలుపై అకస్మాత్తుగా కుప్పకూలింది. ప్రమాద సమయంలో రైలులో 195 మంది ఉన్నారు.