ట్రంప్‌కి మరో ఎదురుదెబ్బ
ABN , Publish Date - Feb 27 , 2026 | 04:02 AM
సుంకాలపై ఇటీవలే ఎదురుదెబ్బ తిన్న అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌కు కోర్టులో మరో వ్యతిరేక తీర్పు వచ్చింది. అక్రమ వలసదారులను అమెరికా నుంచి వారి స్వదేశాలకు కాకుండా మూడో...
అక్రమ వలసదారులను అమెరికా నుంచి వారి స్వదేశానికి కాకుండా మరో దేశానికి పంపడం చట్టవిరుద్ధమన్న కోర్టు
న్యూయార్క్, ఫిబ్రవరి 26: సుంకాలపై ఇటీవలే ఎదురుదెబ్బ తిన్న అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌కు కోర్టులో మరో వ్యతిరేక తీర్పు వచ్చింది. అక్రమ వలసదారులను అమెరికా నుంచి వారి స్వదేశాలకు కాకుండా మూడో దేశానికి డీపోర్ట్ చేయడం (మూడో దేశానికి బహిష్కరణ) చట్టవిరుద్ధమని యూఎస్ ఫెడరల్ జడ్జి బ్రియాన్ మర్ఫీ బుధవారం తీర్పునిచ్చారు. అయితే, దీనిపై ట్రంప్ సర్కారు సుప్రీంకోర్టులో అప్పీలు చేసుకోవడానికి వీలుగా తన ఆదేశాల అమలును 15 రోజులపాటు నిలిపివేస్తూ ఆయన నిర్ణయం తీసుకున్నారు. చట్టపరంగా చెల్లుబాటయ్యే పత్రాలు లేకుండా అమెరికాలో ఉంటున్నవారిని.. ముందస్తు సమాచారం లేకుండా, తగినంత ముందుగా నోటీసులు ఇవ్వకుండా, వారు పీడనకు, చిత్రహింసలకు గురయ్యే ప్రమాదం ఉన్న దేశాలకు తరలించడం వారి ప్రాథమిక హక్కులను ఉల్లంఘించడమేనని జడ్జి అభిప్రాయపడ్డారు. వలసదారుల ను మూడో దేశానికి పంపడంపై మానవహక్కుల సంఘాలు కోర్టును ఆశ్రయించాయి. కేసు విచారణలో భాగంగా.. జడ్జి పైవిధంగా తీర్పిచ్చారు.