Share News

Nobel controversy: 2025 నోబెల్‌ ఎప్పటికీ మచాడోదే

ABN , Publish Date - Jan 20 , 2026 | 01:21 AM

వెనిజులా ప్రతిపక్ష నేత మరియా మచాడోకి ఇచ్చిన 2025 సంవత్సరం నోబెల్‌ శాంతి బహుమతిని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌...

Nobel controversy: 2025 నోబెల్‌ ఎప్పటికీ మచాడోదే

న్యూఢిల్లీ, జనవరి 19 : వెనిజులా ప్రతిపక్ష నేత మరియా మచాడోకి ఇచ్చిన 2025 సంవత్సరం నోబెల్‌ శాంతి బహుమతిని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌కు ఇచ్చివేయడంపై ప్రపంచ వ్యాప్తంగా చర్చ నెలకొంది. పలువురు దీనిపై విమర్శలు వ్యక్తం చేస్తూ.. నోబెల్‌ ఫౌండేషన్‌ దాన్ని వెనక్కు తీసుకోవాలని లేదా మరొకరికి ఇవ్వాలని సూచిస్తున్నారు. దీనిపై స్పందించిన నార్వేజియన్‌ నోబెల్‌ ఇన్‌స్టిట్యూట్‌.. మచాడో నోబెల్‌ బహుమతిని ట్రంప్‌కు ఇచ్చినా.. ఆ గౌరవం ఆమెకే చెందుతుందని పేర్కొంది. దాన్ని బదిలీ చేయడంగానీ, పంచుకోవడంగానీ, రద్దు చేయడంగానీ సాధ్యం కాదని గత వారమే స్పష్టం చేసింది. ఎప్పటికీ ఇదే తుది నిర్ణయమని, ఇందులో మార్పు ఉండదని పేర్కొంది.

Updated Date - Jan 20 , 2026 | 01:21 AM