Share News

అమెరికా ఎఫ్‌-35కు చైనా చెక్‌!

ABN , Publish Date - Mar 11 , 2026 | 03:51 AM

ఏ చిన్నపాటి కాల్పులు సైతం జరపకుండానే అమెరికాకు చెందిన శక్తిమంతమైన ఎఫ్‌-35 యుద్ధ విమానాలను నిలువరించడం, ఎఫ్‌-35కు అత్యంత ముఖ్యమైన అరుదైన భూఖనిజాలపై నియంత్రణను మరింత పెంచడం.

అమెరికా ఎఫ్‌-35కు చైనా చెక్‌!

  • అరుదైన ఖనిజాల నియంత్రణతో యుద్ధ విమానాలు నిలువరించే ప్లాన్‌

  • 15వ పంచవర్ష ప్రణాళికలో భారీ లక్ష్యాలు నిర్దేశించుకున్న బీజింగ్‌

బీజింగ్‌, మార్చి 10: ఏ చిన్నపాటి కాల్పులు సైతం జరపకుండానే అమెరికాకు చెందిన శక్తిమంతమైన ఎఫ్‌-35 యుద్ధ విమానాలను నిలువరించడం, ఎఫ్‌-35కు అత్యంత ముఖ్యమైన అరుదైన భూఖనిజాలపై నియంత్రణను మరింత పెంచడం. ఆర్థిక వ్యవస్థలో కృత్రిమ మేధ(ఏఐ)కు కనీవినీ ఎరుగని ప్రాధాన్యం ఇవ్వడం. మానవ రోబోలను రెట్టింపు చేయడం. స్పేస్‌-ఎర్త్‌(అంతరిక్షం-భూమి) క్వాంటమ్‌ కమ్యూనికేషన్‌ నెట్‌వర్క్‌ను నిర్మించడం. అణు పరిశోధనలను విస్తరించడం. అధునాతన మేధో-కంప్యూటర్‌ ఇంటర్‌ఫేస్‌ సాంకేతికతను అభివృద్ధి చేయడం... ఇదీ చైనా పెట్టుకున్న భారీ లక్ష్యం. తద్వారా అమెరికాకు చెక్‌ పెట్టాలన్నది బీజింగ్‌ ప్రధాన ఉద్దేశం. ఈ మేరకు నేషనల్‌ పీపుల్స్‌ కాంగ్రెస్‌ సమావేశంలో చైనా అధ్యక్షుడు షి జిన్‌పింగ్‌ ఈ నెల 5న 141 పేజీల 15వ పంచవర్ష ప్రణాళికను ఆవిష్కరించారు. చిత్రం ఏంటంటే.. ప్రస్తుతం ఇరాన్‌పై అమెరికా, ఇజ్రాయెల్‌ సంయుక్తంగా చేస్తున్న యుద్ధం నేపథ్యంలో అందరి దృష్టీ చమురు, క్షిపణులపైనే ఉంది. ఇలాంటి సమయంలో చైనా చాలా నిశ్శబ్దంగా వ్యూహాత్మక పంచవర్ష ప్రణాళికను ఆవిష్కరించడం విశేషం. ఆర్థిక, సైనిక శక్తి బలోపేతం, అధునాతన సాంకేతికత, అరుదైన భూ ఖనిజాలపై పైచేయి సాధించడం వంటివి ఈ ప్రణాళికల్లో ఉన్నాయి.

Updated Date - Mar 11 , 2026 | 03:51 AM