భర్త కౌగిలిలో విరిగిపోయిన భార్య ఎముకలు
ABN , Publish Date - Oct 23 , 2026 | 03:53 AM
ఏమండి బాగా చలేస్తోంది..!! అని భార్య చెప్పగానే.. రొమాంటిక్‌గా ఆలోచించిన భర్త వెంటనే ఆమెను గట్టిగా కౌగిలించుకున్నాడు. కానీ భర్త కౌగిలి పట్టుకు ఆ భార్య పక్కటెముకల పటపటమని విరిగిపోయాయి..!!
బీజింగ్, అక్టోబరు 22: ఏమండి బాగా చలేస్తోంది..!! అని భార్య చెప్పగానే.. రొమాంటిక్‌గా ఆలోచించిన భర్త వెంటనే ఆమెను గట్టిగా కౌగిలించుకున్నాడు. కానీ భర్త కౌగిలి పట్టుకు ఆ భార్య పక్కటెముకల పటపటమని విరిగిపోయాయి..!! అక్టోబరు 19న చైనాలో ఈ ఘటన చోటు చేసుకుంది. అంతర్జాతీయ మీడియా కథనాల ప్రకారం.. వాంగ్ అనే ఇంటి పేరున్న ఓ జంటలోని భార్య.. తనకు బాగా చలేస్తోందని భర్తకు చెప్పింది. ఆ వెంటనే భర్త ఆమెను కౌగిలించుకోగా.. ఏదో విరిగిన శబ్ధం వినిపించింది. ఈలోపే భార్య నొప్పితో విలవిలాడుతూ పడిపోయింది. ఏదో సాధారణమైన నొప్పి అని తొలుత వారు భావించారు. తెల్లవారినా నొప్పి తగ్గకపోవడంతో ఉదయాన్నే ఆస్పత్రికి వెళ్లారు. ఆమె పక్కటెముకల్లో ఐదు ఎముకలు విరిగినట్టు సీటీ స్కాన్‌లో తేలడంతో దంపతులు నివ్వెరపోయారు. అయితే, ఆస్టియోపోరోసిస్ అనే ఎముకల వ్యాధి, డీ విటమిన్ లోపంతో సదరు మహిళ బాధపడుతుండడం వల్లే ఇలా జరిగిందని, కౌగిలి వల్ల కాదని వైద్యులు గుర్తించారు.