పహల్గాంపై చైనా ఉపగ్రహాల నిఘా!
ABN , Publish Date - Nov 25 , 2026 | 04:08 AM
పహల్గాంలో గతేడాది ఉగ్రదాడికి ముందు చైనా ఉపగ్రహాలు ఆ ప్రాంతంపై చక్కర్లు కొట్టిన విషయం తాజాగా బయటపడింది. చైనాకు చెందిన భూ పరిశీలన ఉపగ్రహాలు అసాధారణ..
ఉగ్రదాడికి ముందు ఆ ప్రాంతమంతా జల్లెడ
డ్రాగన్ ఉపగ్రహాల కదలికలను గుర్తించిన బెంగళూరు స్టార్టప్ దిగంతర
న్యూఢిల్లీ, నవంబరు 26: పహల్గాంలో గతేడాది ఉగ్రదాడికి ముందు చైనా ఉపగ్రహాలు ఆ ప్రాంతంపై చక్కర్లు కొట్టిన విషయం తాజాగా బయటపడింది. చైనాకు చెందిన భూ పరిశీలన ఉపగ్రహాలు అసాధారణ రీతిలో 37సార్లు తమ కక్ష్యలు మార్చుకుని ఆ ప్రాంతంపై నిఘా కోసం రౌండ్లు వేశాయి. అంతరిక్షాన్ని పరిశీలించే బెంగళూరు స్టార్టప్ కంపెనీ ‘దిగంతర’ దీనిని గుర్తించింది. ఆ వివరాలను ‘ద ప్రింట్’ న్యూస్ ప్రత్యేకంగా ప్రచురించింది. ఆ ఉపగ్రహాలు 2025 ఏప్రిల్ 15-30 మధ్య తమ కక్ష్యలను దాటి పహల్గాంను జల్లెడ పట్టేందుకు భ్రమణాలను పెంచాయని ఆ సంస్థ పేర్కొంది. గతేడాది ఏప్రిల్ 22న పహల్గాం దాడి జరగగా, దానికి 6రోజుల ముందు నుంచి ఆ ఉపగ్రహాలు పహల్గాం ప్రాంతాన్ని క్షుణ్ణంగా పరిశీలించేందుకు అంతరిక్షంలో గిరగిరా తిరిగాయి. చైనా ఉపగ్రహాలు ఎందుకు ఇలా తిరిగాయి అనే విషయాన్ని దిగంతర స్పష్టం చేయలేదు. కానీ, భద్రతా దళాల కదలికలను గుర్తించడానికి లేదా పాక్ నుంచి వచ్చిన ఉగ్రవాదులు తప్పించుకోవడానికి వీలయ్యే మార్గాలు కనిపెట్టడానికి అవి తిరిగి ఉంటాయని నిఘా వర్గాలు పేర్కొన్నాయి.