Share News

చైనా రక్షణ బడ్జెట్‌ 23.13 లక్షల కోట్లు!

ABN , Publish Date - Mar 06 , 2026 | 05:31 AM

అమెరికా సైనికశక్తికి సవాల్‌ విసురుతూ చైనా తన రక్షణ బడ్జెట్‌ను భారీగా పెంచింది. 2025-26 ఆర్థిక సంవత్సరానికి గాను రక్షణ బడ్జెట్‌ను 277 బిలియన్‌ డాలర్లకు....

చైనా రక్షణ బడ్జెట్‌ 23.13 లక్షల కోట్లు!

బీజింగ్‌, మార్చి 5: అమెరికా సైనికశక్తికి సవాల్‌ విసురుతూ చైనా తన రక్షణ బడ్జెట్‌ను భారీగా పెంచింది. 2025-26 ఆర్థిక సంవత్సరానికి గాను రక్షణ బడ్జెట్‌ను 277 బిలియన్‌ డాలర్లకు(సుమారు రూ.23.13 లక్షల కోట్లు) పెంచుతున్నట్లు ఆ దేశ ప్రధాని లీ కియాంగ్‌ పార్లమెంటు(నేషనల్‌ పీపుల్స్‌ కాంగ్రెస్)లో గురువారం ప్రకటించారు. ఇది గతేడాది కంటే రూ.2.10లక్షల కోట్లు(7శాతం) అదనం కావడం గమనార్హం. తమ దేశ జీడీపీతో పోలిస్తే ఈ వ్యయం చాలా తక్కువని చైనా సమర్థించుకున్నప్పటికీ, ప్రపంచంలో అమెరికా తర్వాత రెండో అతి పెద్ద రక్షణ బడ్జెట్‌ చైనాదే. డ్రాగన్‌ నిర్ణయం భారత్‌ సహా పొరుగు దేశాలపై వ్యూహాత్మక ఒత్తిడిని పెంచనుంది. ఈ ఏడాది భారత రక్షణ బడ్జెట్‌ రూ. 7.85 లక్షల కోట్లు కాగా, చైనా రక్షణ వ్యయం భారత్‌ కంటే 3రెట్లు ఎక్కువగా ఉంది.

Updated Date - Mar 06 , 2026 | 05:31 AM