ఇరాన్ అగ్ర నేతలను లక్ష్యం చేసుకోవడం సరికాదన్న చైనా
ABN , Publish Date - Mar 20 , 2026 | 05:06 AM
ఇరాన్ సెక్యూరిటీ చీఫ్ అలీ లారీజాని, నిఘా శాఖ మంత్రి ఇజ్రాయెల్ ఖతీబ్, బసిజ్ ఫోర్స్ చీఫ్ గులామ్‌రజా సులేమానీ తదితర అగ్ర నాయకులను ఇజ్రాయెల్ అంతం ...
బీజింగ్, మార్చి 19: ఇరాన్ సెక్యూరిటీ చీఫ్ అలీ లారీజాని, నిఘా శాఖ మంత్రి ఇజ్రాయెల్ ఖతీబ్, బసిజ్ ఫోర్స్ చీఫ్ గులామ్‌రజా సులేమానీ తదితర అగ్ర నాయకులను ఇజ్రాయెల్ అంతం చేయడంపై చైనా తొలిసారి స్పందించింది. నాయకుల హత్యలను చైనా ప్రభుత్వం ఖండించింది. ఈ తరహా హంతక దాడులు క్షంతవ్యం కాదని ఆ దేశ విదేశాంగ శాఖ ప్రతినిధి లిన్ జియాన్ హెచ్చరించారు.