ఎన్విడియా చిప్స్ స్మగ్లింగ్ వెనుక చైనా వ్యాపారి!
ABN , Publish Date - Nov 23 , 2026 | 04:03 AM
ఎన్విడియా చిప్స్‌ను చైనాకు అక్రమంగా తరలించడంలో ఆ దేశ గూఢచారిణిగా అనుమానిస్తున్న ఆలిస్ హువాంగ్ పాత్ర ఉందనే ఆరోపణలు ఉన్నాయి.
న్యూయార్క్/సింగపూర్, నవంబరు 22: ఎన్విడియా చిప్స్‌ను చైనాకు అక్రమంగా తరలించడంలో ఆ దేశ గూఢచారిణిగా అనుమానిస్తున్న ఆలిస్ హువాంగ్ పాత్ర ఉందనే ఆరోపణలు ఉన్నాయి. అయితే ఆలిస్ తెరముందు వక్తి మాత్రమేనని, తెరవెనుక చైనా వ్యాపారవేత్త ఒకరు ఉన్నారని వాల్‌స్ట్రీట్ జర్నల్ (డబ్ల్యూఎస్‌జే) నివేదిక వెల్లడించింది. సింగపూర్‌లో మోసం అభియోగాలు ఎదుర్కొంటున్న 52 ఏళ్ల చైనా జాతీయుడు లీ మింగ్.. ఎన్విడియా ఏఐ చిప్‌లను చైనాకు అక్రమంగా తరలించే నెట్‌వర్క్‌లో భాగమైన సింగపూర్ సంస్థ మెగాస్పీడ్ కార్యకలాపాలు, వ్యాపార నిర్ణయాల్లో కీలక పాత్ర పోషించినట్టు వాల్‌స్ట్రీట్ జర్నల్ నివేదిక వెల్లడించింది. సింగపూర్‌కు చెందిన మెగాస్పీడ్ సంస్థలో ఆలిస్, ఆమె భర్త కాంగ్ వీలతో కలిసి లీ మింగ్ పనిచేశాడు.