Canada Faces Work Permit Crisis: కెనడాలో వర్క్ పర్మిట్ల సంక్షోభం!
ABN , Publish Date - Jan 04 , 2026 | 04:23 AM
కెనడాలో వర్క్ పర్మిట్ల సంక్షోభం తీవ్రమవుతోంది. నెలల వ్యవధిలోనే లక్షలాది మంది వర్క్ పర్మిట్ల గడువు ముగుస్తుండటంతో చట్టబద్ధత లేకుండా నివసించే వారి సంఖ్య గణనీయంగా పెరిగిపోతోంది...
ముప్పు ముంగిట్లో 10 లక్షల మంది భారతీయులు
న్యూఢిల్లీ, జనవరి 3: కెనడాలో వర్క్ పర్మిట్ల సంక్షోభం తీవ్రమవుతోంది. నెలల వ్యవధిలోనే లక్షలాది మంది వర్క్ పర్మిట్ల గడువు ముగుస్తుండటంతో చట్టబద్ధత లేకుండా నివసించే వారి సంఖ్య గణనీయంగా పెరిగిపోతోంది. 2025 సంవత్సరం చివరి నాటికి 10.53 లక్షల మంది వర్క్ పర్మిట్ల గడువు ముగిసిపోగా, 2026లో మరో 9.27 లక్షల మందికి ఈ కాలపరిమితి తీరనుంది. ఈ నేపథ్యంలో 2026 మధ్య నాటికి దాదాపు 20 లక్షల మంది వలసదారులు కెనడాలో నివసించడానికి చట్టబద్ధ హోదా కోల్పోనున్నారు. కెనడా వలసలు, శరణార్థులు, పౌరతస్వ సేవల సంస్థ (ఐఆర్‌సీసీ) గణాంకాల ప్రకారం వీరిలో సగం మంది అంటే దాదాపు 10 లక్షల మంది వరకూ భారతీయులే ఉండే అవకాశం ఉంది. వర్క్ పర్మిట్ గడువు ముగిసేలోగా మరో వీసా గానీ, శాశ్వత నివాసం హోదా గాను పొందలేకపోతే వారి చట్టబద్ధ హోదా రద్దవుతుంది. ఈ ఏడాది మధ్య నాటికి వేలాది మంది విద్యార్థుల స్టడీ పర్మిట్లు కూడా ముగుస్తాయని, వలస నిబంధనలను ప్రభుత్వం కఠినతరం చేయడమే దీనికి కారణమని ఇమిగ్రేషన్ నిపుణులు పేర్కొంటున్నారు.