Share News

భారత్‌తో ఇంధన వాణిజ్యంపై దృష్టి

ABN , Publish Date - Jan 28 , 2026 | 03:19 AM

భారత్‌లో ఇంధన వినియోగం వేగంగా పెరుగుతున్న నేపథ్యంలో మన మార్కెట్‌పై కెనడా దృష్టిసారించింది. కస్టమర్ల సంఖ్యను విస్తరించుకోవడంతోపాటు అమెరికాకు సరఫరాపై ఆధారపడటాన్ని తగ్గించుకోవాలని ఆ దేశం భావిస్తోంది.

భారత్‌తో ఇంధన వాణిజ్యంపై దృష్టి

  • కెనడా ఇంధన శాఖ మంత్రి టిమ్‌ హాడ్గ్‌సన్‌ వెల్లడి

దక్షిణ గోవా, జనవరి 27: భారత్‌లో ఇంధన వినియోగం వేగంగా పెరుగుతున్న నేపథ్యంలో మన మార్కెట్‌పై కెనడా దృష్టిసారించింది. కస్టమర్ల సంఖ్యను విస్తరించుకోవడంతోపాటు అమెరికాకు సరఫరాపై ఆధారపడటాన్ని తగ్గించుకోవాలని ఆ దేశం భావిస్తోంది. ఇందులో భాగంగా మన దేశానికి ఇంధన ఎగుమతులను పెంచాలనుకుంటున్నట్టు కెనడా ఇంధన శాఖ మంత్రి టిమ్‌ హాడ్గ్‌సన్‌ మంగళవారం పేర్కొన్నారు. ఇండియన్‌ ఎనర్జీ వీక్‌ కాన్ఫరెన్స్‌లో ఆయన మాట్లాడారు. అమెరికాకు తన ఇంధనంలో 98ు ఎగుమతులు చేస్తుండటం వ్యూహాత్మక పొరపాటుగా పేర్కొన్నారు. అలాగే భారత్‌తో కలిసి పని చేసే అవకాశాన్ని తాము గుర్తించినట్టు తెలిపారు. ఇంధనానికి ప్రపంచంలోనే అత్యంత వేగంగా డిమాండ్‌ భారత్‌లో పెరుగుతోందని పేర్కొన్నారు. భారత్‌కు ముడిచమురుతోపాటు లిక్విఫైడ్‌ నేచురల్‌ గ్యాస్‌ (ఎల్‌ఎన్‌జీ), యురేనియంలను కెనడా సరఫరా చేయగలదన్నారు.

Updated Date - Jan 28 , 2026 | 03:19 AM