Share News

బిల్‌గేట్స్‌కు సుఖ వ్యాధులు!

ABN , Publish Date - Feb 01 , 2026 | 04:08 AM

అమెరికాను ఓ కుదుపు కుదిపేసిన జెఫ్రీ ఎప్‌స్టీన్‌ సెక్స్‌ కుంభకోణంలో మైక్రోసాఫ్ట్‌ సహ వ్యవస్థాపకుడు బిల్‌గేట్స్‌కు సంబంధించిన వివరాలు సంచలనంగా మారాయి.

బిల్‌గేట్స్‌కు సుఖ వ్యాధులు!

  • రష్యన్‌ బాలికలతో లైంగిక సంబంధాలు

  • ఎప్‌స్టీన్‌ మెయిల్స్‌లో వివరాలు

  • పత్రాల్లో మస్క్‌, మీరా నాయర్‌, మెలానియా ట్రంప్‌ పేర్లు

న్యూయార్క్‌, జనవరి 31: అమెరికాను ఓ కుదుపు కుదిపేసిన జెఫ్రీ ఎప్‌స్టీన్‌ సెక్స్‌ కుంభకోణంలో మైక్రోసాఫ్ట్‌ సహ వ్యవస్థాపకుడు బిల్‌గేట్స్‌కు సంబంధించిన వివరాలు సంచలనంగా మారాయి. ఈ కుంభకోణానికి సంబంధించిన మరో 30 లక్షలకు పైగా పత్రాలను, 2వేల వీడియోలను, 1.80లక్షల చిత్రాలను అమెరికా న్యాయశాఖ తాజాగా బయటపెట్టింది. వీటిలో బిల్‌గేట్స్‌ సైన్స్‌ అడ్వైజర్‌ బోరిస్‌ నికోలిక్‌ పేరుతో ఎప్‌స్టీన్‌ తనకు తాను రాసుకున్న మెయిల్స్‌లో సంచలన విషయాలు ఉన్నాయి. రష్యన్‌ బాలికల తో లైంగిక సంబంధాల వల్ల బిల్‌గేట్స్‌ సుఖ వ్యాధుల బారిన పడ్డారని ఎప్‌స్టీన్‌ రాశాడు. ఆ వ్యాధులు నాటి తన సతీమణి మిలిండా గేట్స్‌కు సోకకుండా ఉండేందుకు ఆమెకు రహస్యంగా ఇచ్చేందు కోసం యాంటీబయాటిక్‌ ఔషధాలు కావాలని గేట్స్‌ తనను అడిగారని తెలిపాడు. అయితే, ఈ ఆరోపణలను గేట్స్‌ కార్యాలయం శనివారం ఖండించింది. కాగా, తాజా పత్రాల్లో ట్రంప్‌ సతీమణి మెలానియా, బ్రిటన్‌ మాజీ యువరాజు ఆండ్రూ మౌంట్‌బాటన్‌, భారత సంతతి అమెరికా సినీ దర్శకురాలు మీరా నాయర్‌, ప్రపంచ కుబేరుడు ఎలాన్‌ మస్క్‌ పేర్లు ప్రముఖంగా బయటకు వచ్చాయి. ఎప్‌స్టీన్‌ నివాసంలో 2009 అక్టోబర్‌ 21న ఏర్పాటుచేసిన విందు అనంతర సమావేశానికి భారత సంతతి సినీ దర్శకురాలు, న్యూయార్క్‌ మేయర్‌ జోహ్రాన్‌ మమ్దానీ తల్లి మీరా నాయర్‌ కూడా హాజరైనట్లు తాజా పత్రాల్లో ఉంది. 2009లో వచ్చిన తన సినిమా ‘అమెలియా’ గురించి ప్రచారం చేసేందుకే ఆమె ఆ సమావేశానికి వెళ్లినట్లు ఆ పత్రాలను బట్టి తెలుస్తోంది. ఈ సమావేశంలో క్లింటన్‌, బెజోస్‌ కూడా ఉన్నారు.

Updated Date - Feb 01 , 2026 | 04:09 AM