వివాదంగా మారిన బీఫ్ బార్బెక్యూ తయారీ
ABN , Publish Date - Sep 13 , 2026 | 05:31 AM
తన ఇంట్లో అద్దెకు ఉంటున్న వ్యక్తితో గొడవ పడినందుకు కెనడాలోని సర్రీలో భారత మూలాలు ఉన్న రాజ్ తివానా అనే మహిళను పోలీసులు అరెస్టు చేశారు. ఇంటి వెనక ఉన్న పెరటితోటలో బీఫ్‌ను నిప్పులపై కాల్చడమే గొడవకు తక్షణ కారణంగా మారింది.
కెనడాలో భారతీయ మహిళ అరెస్టు
సర్రీ (కెనడా), సెప్టెంబరు 12: తన ఇంట్లో అద్దెకు ఉంటున్న వ్యక్తితో గొడవ పడినందుకు కెనడాలోని సర్రీలో భారత మూలాలు ఉన్న రాజ్ తివానా అనే మహిళను పోలీసులు అరెస్టు చేశారు. ఇంటి వెనక ఉన్న పెరటితోటలో బీఫ్‌ను నిప్పులపై కాల్చడమే గొడవకు తక్షణ కారణంగా మారింది. ఇనుప గ్రిల్స్‌పై మాంసం ముక్కలు పెట్టి కట్టెలతో కాల్చడాన్ని బార్బెక్యూగా వ్యవహరిస్తుంటారు. తన ఇంటికి వచ్చిన స్నేహితుడి కోసం ఆ వ్యక్తి బార్బెక్యూ చేయగా, అలా చేయడాన్ని ఒప్పుకోనంటూ ఆమె దాన్ని లాగేసింది. దీంతో గొడవ పెరిగింది. ఇంటి యజమానురాలు అనుమతి లేకుండా తన ఇంట్లోకి చొరబడి, సామానుకు నష్టం కలిగించిందని అద్దెకు ఉండే వ్యక్తి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. అద్దె చెల్లిస్తున్నందున ఇంటికి వచ్చిన స్నేహితుడి కోసం పెరటి తోటలో బార్బెక్యూ చేసే అధికారం తనకు ఉందని చెప్పాడు. పోలీసులు యజమానురాలిని అరెస్టు చేశారు.