Share News

ఏడుగురు అవామీలీగ్‌ పార్టీ నేతలకు ఉరిశిక్ష!

ABN , Publish Date - Sep 16 , 2026 | 06:41 AM

బంగ్లాదేశ్‌ మాజీ ప్రధాని షేక్‌ హసీనా నేతృత్వంలోని నిషేధిత అవామీ లీగ్‌ పార్టీకి చెందిన ఏడుగురు కీలక నేతలకు ఉరిశిక్ష ఖరారైంది. 2024 విద్యార్థుల అల్లర్ల కేసులో ఆందోళనకారులపై..

ఏడుగురు అవామీలీగ్‌ పార్టీ నేతలకు ఉరిశిక్ష!

ఢాకా, సెప్టెంబరు 15: బంగ్లాదేశ్‌ మాజీ ప్రధాని షేక్‌ హసీనా నేతృత్వంలోని నిషేధిత అవామీ లీగ్‌ పార్టీకి చెందిన ఏడుగురు కీలక నేతలకు ఉరిశిక్ష ఖరారైంది. 2024 విద్యార్థుల అల్లర్ల కేసులో ఆందోళనకారులపై దాడులకు ఆదేశాలివ్వడంతో పాటు హింసకు ప్రేరేపించడం వంటి నేరాలకు పాల్పడినట్లు ఆ దేశ అంతర్జాతీయ నేరాల ట్రైబ్యునల్‌(ఐటీసీ) కోర్టు నిర్ధారించింది. ఈ కేసులో నిందితులుగా ఉన్న నేతలందరూ గైర్హాజరీలో ఉండగానే, ముగ్గురు సభ్యుల ధర్మాసనం విచారణ జరిపి మరణశిక్ష విధిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. శిక్ష పడిన వారిలో హసీనా ముఖ్య అనుచరుడు, అవామీలీగ్‌ జనరల్‌ సెక్రటరీ ఒబైదుల్‌ ఖాదర్‌, మాజీమంత్రి మహమ్మద్‌ అలీ అరాఫత్‌ సహా పలువురు అగ్రనేతలు ఉన్నారు. గతంలో ఇదే ఉదంతంలో షేక్‌ హాసీనాకు సైతం ఇదే ట్రైబ్యునల్‌ మరణశిక్ష విధించిన సంగతి తెలిసిందే.

Updated Date - Sep 16 , 2026 | 06:42 AM