Share News

Visa services: భారత్‌కు వీసా సేవలు రద్దు చేసిన బంగ్లాదేశ్‌

ABN , Publish Date - Jan 09 , 2026 | 04:10 AM

భద్రతా కారణాల దృష్ట్యా భారత్‌కు వీసా సేవలను రద్దు చేస్తున్నట్టు గురువారం బంగ్లాదేశ్‌ విదేశీ వ్యవహారాల సలహాదారు ఎం. తౌహిద్‌ హుస్సేన్‌ ప్రకటించారు..

Visa services: భారత్‌కు వీసా సేవలు రద్దు చేసిన బంగ్లాదేశ్‌

ఢాకా, జనవరి 8: భద్రతా కారణాల దృష్ట్యా భారత్‌కు వీసా సేవలను రద్దు చేస్తున్నట్టు గురువారం బంగ్లాదేశ్‌ విదేశీ వ్యవహారాల సలహాదారు ఎం. తౌహిద్‌ హుస్సేన్‌ ప్రకటించారు. ఈ మేరకు తగిన చర్యలు తీసుకోవాలని ఢిల్లీలోని రాయబార కార్యాలయం, కోల్‌కతాలోని డిప్యూటీ హైకమిషనర్‌ కార్యాలయాలను ఆదేశించారు. ముంబయి, చెన్నైల్లోని బంగ్లాదేశ్‌ దౌత్య కార్యాలయాలు యథావిధిగా పనిచేయనున్నాయి. అంతకుముందు భారత్‌ తీసుకున్న చర్యకు ప్రతిచర్యగా బంగ్లాదేశ్‌ ఈ నిర్ణయం తీసుకొంది. బంగ్లాదేశ్‌ వెళ్లేందుకు బిజినెస్‌, వర్క్‌ వీసాలు ఇవ్వకూడదని న్యూఢిల్లీ, అగర్తలాల్లోని కార్యాలయాలకు భారత్‌ విదేశీ వ్యవహారాల శాఖ ఆదేశాలు పంపింది.

Updated Date - Jan 09 , 2026 | 04:10 AM