Journalist Rana Pratap: మరో హిందూ దారుణ హత్య
ABN , Publish Date - Jan 06 , 2026 | 12:58 AM
బంగ్లాదేశ్‌లో హిందువులపై దాడులు కొనసాగుతునే ఉన్నాయి. గుర్తు తెలియని వ్యక్తులు సోమవారం రాణాప్రతాప్ బైరాగి(45) అనే జర్నలిస్టును దారుణంగా హత్య చేశారు.
ఢాకా, జనవరి 5: బంగ్లాదేశ్‌లో హిందువులపై దాడులు కొనసాగుతునే ఉన్నాయి. గుర్తు తెలియని వ్యక్తులు సోమవారం రాణాప్రతాప్ బైరాగి(45) అనే జర్నలిస్టును దారుణంగా హత్య చేశారు. తుపాకీతో తలపై కాల్పులు జరపడంతో పాటు కత్తితో గొంతు కోశారు. జషోర్ జిల్లాలోని మణిరాంపూర్‌లో ఈ ఘటన జరిగింది. రాణాప్రతాప్ నరాయిల్ జిల్లాలో బి.డి.కబొర్ అనే పత్రికను నిర్వహిస్తూ యాక్టింగ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. గత రెండేళ్లుగా మణిరాంపూర్‌లోని కొపాలియా బజారులో ఐస్ ఫ్యాక్టరీ నిర్వహిస్తున్నారు. ఫ్యాక్టరీ దగ్గరకు వచ్చిన దుండగులు ఆయనను బయటకు పిలిచారు. బయటకు వచ్చిన ఆయనను వెంటనే పక్క సందులోకి తీసుకెళ్లి తుపాకీతో కాల్చి చంపారు. రాణా ప్రతా్‌పకు ఉగ్రవాద సంస్థతో సంబంధం ఉందన్న ఆరోపణలతో పోలీసులు గతంలో పలు కేసులు పెట్టారు. అయుతే అన్ని కేసుల్లో ఆయన నిర్దోషిగా విడుదలైనట్లు బి.డి.కబోర్ పత్రిక న్యూస్ ఎడిటర్ కషెమ్ చెప్పారు.