బంగ్లాదేశ్‌లో హిందూ యువకుడి సజీవ దహనం
ABN , Publish Date - Jan 26 , 2026 | 04:14 AM
బంగ్లాదేశ్‌లో మరో హిందూ యువకుడు హత్యకు గురయ్యాడు. రాత్రి వేళ నిద్రిస్తున్న సమయంలో కొందరు గుర్తు తెలియని వ్యక్తులు పెట్రోలు పోసి నిప్పటించారు.
ఢాకా, జనవరి 25: బంగ్లాదేశ్‌లో మరో హిందూ యువకుడు హత్యకు గురయ్యాడు. రాత్రి వేళ నిద్రిస్తున్న సమయంలో కొందరు గుర్తు తెలియని వ్యక్తులు పెట్రోలు పోసి నిప్పటించారు. నర్సింగిడి పట్టణంలో శుక్రవారం రాత్రి చంచల్ చంద్ర భౌమిక్ అనే 23 ఏళ్ల యువకుడు ఈ దారుణ హత్యకు గురయ్యాడు. కుమిల్లా జిల్లా లక్ష్మీపూర్ గ్రామానికి చెందిన ఆ యువకుడు నర్సింగిడి మసీదు మార్కెట్‌లోని పోలీసు లైన్స్ సమీపంలో ఉన్న గ్యారేజీలో పని చేస్తున్నాడు. పనులు ముగించుకొని గ్యారేజీలో నిద్రిస్తుండగా కొందరు వ్యక్తులు షట్టర్ వద్ద పెట్రోలు పోసి నిప్పటించారు. సీసీటీవీ కెమేరా ఫుటేజీలను స్వాధీనం చేసుకున్న పోలీసులు కేసు దర్యాప్తు ప్రారంభించారు.