Share News

ఢాకాలో డ్రోన్ల తయారీ కేంద్రం!

ABN , Publish Date - Jan 29 , 2026 | 05:04 AM

బంగ్లాదేశ్‌ రక్షణ వ్యవస్థను బలోపేతం చేసే దిశగా అడుగులు వేస్తోంది. ఇందులో భాగంగా డ్రోన్ల (యూఏవీ) తయారీ కేంద్రాన్ని ఏర్పాటు చేసేందుకు చైనాతో రక్షణ ఒప్పందాన్ని కుదుర్చుకుంది.

ఢాకాలో డ్రోన్ల తయారీ కేంద్రం!

  • చైనాతో బంగ్లాదేశ్‌ రక్షణ ఒప్పందం

ఢాకా, జనవరి 28: బంగ్లాదేశ్‌ రక్షణ వ్యవస్థను బలోపేతం చేసే దిశగా అడుగులు వేస్తోంది. ఇందులో భాగంగా డ్రోన్ల (యూఏవీ) తయారీ కేంద్రాన్ని ఏర్పాటు చేసేందుకు చైనాతో రక్షణ ఒప్పందాన్ని కుదుర్చుకుంది. మంగళవారం ఢాకాలో జరిగిన సమావేశంలో బంగ్లాదేశ్‌ వైమానిక దళం (బీఏఎఫ్‌), చైనాకు చెందిన ప్రభుత్వ రంగ సంస్థ ‘చైనా ఎలకా్ట్రనిక్స్‌ టెక్నాలజీ గ్రూప్‌ కార్పొరేషన్‌ (సీఈటీసీ) ప్రతినిధులు ఈ ఒప్పందంపై సంతకాలు చేసినట్లు రక్షణ శాఖ తెలిపింది. ఈ ఒప్పందం ప్రకారం, బీఏఎఫ్‌, సీఈటీసీ సంయుక్తంగా అత్యాఽధునిక డ్రోన్ల తయారీ, అసెంబ్లింగ్‌ కేంద్రాన్ని బంగ్లాదేశ్‌లో నెలకొల్పుతాయి. కేవలం యంత్రాలను సరఫరా చేయడమే కాకుండా, చైనా ఈ ప్రాజెక్టు ద్వారా కీలకమైన సాంకేతికతను బంగ్లాకు బదిలీ చేస్తుంది. దీనివల్ల దీర్ఘకాలంలో బంగ్లాదేశ్‌ ఎవరిపైనా ఆధారపడకుండా స్వయంగా డ్రోన్లను నిర్మించుకునే సామర్థ్యాన్ని, సాంకేతిక నైపుణ్యాన్ని సాధిస్తుంది.

Updated Date - Jan 29 , 2026 | 05:04 AM