Share News

నేపాల్‌ ప్రధానిగా బాలెన్‌ ప్రమాణ స్వీకారం

ABN , Publish Date - Mar 28 , 2026 | 04:47 AM

రాప్‌ సంగీతంతో యువతను ఆకట్టుకున్న బాలేంద్ర షా (బాలెన్‌) శుక్రవారం నేపాల్‌ ప్రధానిగా ప్రమాణ స్వీకారం చేశారు.

నేపాల్‌ ప్రధానిగా బాలెన్‌ ప్రమాణ స్వీకారం

కాఠ్మాండూ, మార్చి 27: రాప్‌ సంగీతంతో యువతను ఆకట్టుకున్న బాలేంద్ర షా (బాలెన్‌) శుక్రవారం నేపాల్‌ ప్రధానిగా ప్రమాణ స్వీకారం చేశారు. 35 ఏళ్ల బాలెన్‌ ఇంతవరకు బాధ్యతలు నిర్వహించిన ప్రధానుల్లో అత్యంత పిన్నవయస్కుడు కావడం విశేషం. నేపాల్‌ 47వ ప్రధానిగా అధ్యక్షుడు రామచంద్ర పౌడెల్‌ ఆయన చేత ప్రమాణ స్వీకారం చేయించారు. ఆరు నెలల క్రితం దేశంలో జన్‌-జడ్‌ తరం యువత తిరుగుబాటు చేయడంతో నాటకీయ పరిణామాల నేపథ్యంలో అప్పటి కె.పి.శర్మ ఓలి ప్రభుత్వం కుప్పకూలింది. అనంతరం జరిగిన ఎన్నికల్లో రాష్ట్రీయ స్వతంత్ర పార్టీ (ఆర్‌ఎ్‌సపీ)కి చెందిన బాలెన్‌కు ప్రజాదరణ, ముఖ్యంగా యువత మద్దతు లభించింది. నేపాల్‌లోని మాదేశ్‌ ప్రాంతం వ్యక్తి ప్రధాని కావడం ఇదే తొలిసారి. ఆయన రక్షణ, వాణిజ్యం, పరిశ్రమలు, పౌరసరఫరాల శాఖలను కూడా నిర్వహించనున్నారు. ఆయనతో పాటు మంత్రివర్గ సభ్యులు కూడా ప్రమాణ స్వీకారం చేశారు. బాలేన్‌ ప్రమాణ స్వీకారం చేసిన కొద్ది సేపటికే ప్రధాని మోదీ ఆయనను అభినందించారు. రెండు దేశాల మధ్య ఉన్న సంబంధాలను మరింత ఉన్నత స్థాయికి తీసుకెళ్లాలని ఆకాంక్షించారు.

Updated Date - Mar 28 , 2026 | 04:47 AM