Share News

ఇరాన్‌పై ఇంకా దాడులెందుకు?

ABN , Publish Date - Apr 03 , 2026 | 04:15 AM

ఇరాన్‌పై అమెరికా, ఇజ్రాయెల్‌లు ఇంకా దాడులు ఎందుకు కొనసాగిస్తున్నాయని ఆస్ట్రేలియా ప్రధాని ఆంటోనీ అల్బనీస్‌ ప్రశ్నించారు. ఇరాన్‌ వద్ద అణు బాంబులు ఉండరాదన్న ...

ఇరాన్‌పై ఇంకా దాడులెందుకు?

  • ఆస్ట్రేలియా ప్రధాని ఆంటోనీ అల్బనీస్‌

సిడ్నీ, ఏప్రిల్‌ 2: ఇరాన్‌పై అమెరికా, ఇజ్రాయెల్‌లు ఇంకా దాడులు ఎందుకు కొనసాగిస్తున్నాయని ఆస్ట్రేలియా ప్రధాని ఆంటోనీ అల్బనీస్‌ ప్రశ్నించారు. ఇరాన్‌ వద్ద అణు బాంబులు ఉండరాదన్న ఉద్దేశంతో దాడులు ప్రారంభించి, ఆ దేశ అణు కార్యక్రమ మౌలిక వసతులన్నీ ధ్వంసం చేసిన తర్వాత ఇంకా ఎందుకు యుద్ధం కొనసాగిస్తున్నారో అర్థంకావటం లేదని గురువారం ఆయన పేర్కొన్నారు. ఇరాన్‌లో దాడులు చేయటానికి ఇంకా ఏం మిగిలిందని ప్రశ్నించారు. యుద్ధం ఇలాగే కొనసాగితే ప్రపంచ ఆర్థిక వ్యవస్థ మరింత సంక్షోభంలోకి కూరుకుపోతుందని హెచ్చరించారు.

Updated Date - Apr 03 , 2026 | 04:15 AM