Share News

అమెరికా బార్‌లో కాల్పులు.. ముగ్గురి మృతి

ABN , Publish Date - Mar 02 , 2026 | 01:16 AM

అమెరికాలోని టెక్సాస్‌ రాష్ట్రం ఆస్టిన్‌లో ఆదివారం జరిగిన కాల్పుల ఘటనలో ముగ్గురు మరణించగా, 14 మంది గాయపడ్డట్టు అధికారవర్గాలు తెలిపాయి.

అమెరికా బార్‌లో కాల్పులు.. ముగ్గురి మృతి

ఆస్టిన్‌, మార్చి 1: అమెరికాలోని టెక్సాస్‌ రాష్ట్రం ఆస్టిన్‌లో ఆదివారం జరిగిన కాల్పుల ఘటనలో ముగ్గురు మరణించగా, 14 మంది గాయపడ్డట్టు అధికారవర్గాలు తెలిపాయి. పోలీసులు జరిపిన ఎదురు కాల్పుల్లో నిందితుడు కూడా మరణించాడు. బీర్‌ గార్డెన్‌గా పేరుపొందిన బఫోర్డ్‌ బార్‌లో ఈ సంఘటన చోటు చేసుకుంది. బార్‌లో ఓ వ్యక్తి కాల్పులు జరుపుతున్నట్టు పోలీసులకు సమాచారం అందింది. వెంటనే వారు అక్కడికి వెళ్లగా చేతిలో తుపాకీ ఉన్న ఆ వ్యక్తి ఎదురుపడ్డాడు. ఈ సందర్భంగా జరిగిన ఎదురుకాల్పుల్లో ఆ అనుమానితుడు మరణించాడు. గాయపడ్డ వారిని ఆస్పత్రులకు తరలించినట్టు పోలీసులు తెలిపారు.

Updated Date - Mar 02 , 2026 | 01:16 AM