Share News

ట్రంప్‌ రిసార్ట్‌లోకి తుపాకీతో యువకుడు

ABN , Publish Date - Feb 23 , 2026 | 01:34 AM

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ ప్రతి వారాంతంలో విశ్రాంతి కోసం వెళ్లే ‘మార్‌ ఏ లాగో’ రిసార్ట్‌లోకి చొరబడిన సాయుధ దుండగుడిని ...

ట్రంప్‌ రిసార్ట్‌లోకి తుపాకీతో యువకుడు

  • కాల్చి చంపేసిన భద్రతా సిబ్బంది

వాషింగ్టన్‌, ఫిబ్రవరి 22: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ ప్రతి వారాంతంలో విశ్రాంతి కోసం వెళ్లే ‘మార్‌ ఏ లాగో’ రిసార్ట్‌లోకి చొరబడిన సాయుధ దుండగుడిని భద్రతా బలగాలు కాల్చిచంపాయి. అమెరికా కాలమానం ప్రకారం శనివారం అర్ధరాత్రి 1.30 గంటల సమయంలో ఈ ఘటన జరిగింది. 20-22 ఏళ్ల మధ్య వయసున్న యువకుడు ఒక ఎల్పీజీ గ్యాస్‌ క్యాన్‌, షాట్‌ గన్‌తో నార్త్‌ కరోలినాలోని ‘మార్‌ ఏ లాగో’ రిసార్టులోకి ప్రవేశించాడని.. లొంగిపొమ్మని హెచ్చరించినా తమపై తుపాకీ గురిపెట్టడంతో కాల్పులు జరపాల్సి వచ్చిందని సీక్రెట్‌ సర్వీస్‌ విభాగం ప్రతినిధి ఆంథోనీ గుగ్లీయెల్మీ తెలిపారు. సదరు వ్యక్తి కనిపించడం లేదని అతడి కుటుంబం కొన్ని రోజుల క్రితమే పోలీసులకు ఫిర్యాదు చేసిందని గుర్తించామని చెప్పారు. కాగా, ట్రంప్‌పై గతంలో తన వెస్ట్‌పామ్‌ బీచ్‌ క్లబ్‌లో ఒకసారి, అధ్యక్ష ఎన్నికల ప్రచార సమయంలో మరోసారి హత్యా ప్రయత్నాలు జరిగాయి.

Updated Date - Feb 23 , 2026 | 01:34 AM