Joy Mahapatro: బంగ్లాదేశ్‌లో మరో హిందూ యువకుడి హత్య
ABN , Publish Date - Jan 11 , 2026 | 03:11 AM
బంగ్లాదేశ్‌లో మరో హిందువు హత్యకు గురయ్యాడు. సునామ్‌గంజ్ జిల్లా భంగాడోహోర్ గ్రామానికి చెందిన జోయ్ మహాపాత్రో అనే యువకుడిని అమిరుల్...
ఢాకా, జనవరి 10: బంగ్లాదేశ్‌లో మరో హిందువు హత్యకు గురయ్యాడు. సునామ్‌గంజ్ జిల్లా భంగాడోహోర్ గ్రామానికి చెందిన జోయ్ మహాపాత్రో అనే యువకుడిని అమిరుల్ ఇస్లాం అనే స్థానికుడు కొట్టి చంపాడు. మహాపాత్రోను గ్రామంలోని దుకాణానికి పిలిచి దాడికి పాల్పడటంతో పాటు విషం కూడా ఇచ్చినట్లు కుటుంబసభ్యులు తెలిపారు. ఆసుపత్రికి తరలించినా లాభం లేకపోయింది. ఇది కుట్ర ప్రకారం చేసిన హత్య అని, తమకు న్యాయం చేయాలని యువకుడి కుటుంబసభ్యులు డిమాండ్ చేశారు. బంగ్లాదేశ్‌లో గత 35 రోజుల్లో 11 మంది హిందువులు హత్యకు గురయ్యారు. గత నెలలో హిందువులపై 51 హింసాత్మక ఘటనలు నమోదయ్యాయి. బంగ్లాదేశ్‌లో హిందువులు హత్యకు గురవుతున్నా భారత్‌లో ఉన్న సెక్యులర్‌వాదం ముసుగువేసుకున్న వారి నోళ్లు మూతపడ్డాయని యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ విమర్శించారు. ఎవరో ఫెవికాల్ పెట్టి నోటిని మూసినట్లే ఉందని ఆయన ఎద్దేవా చేశారు.