Share News

భారత్‌ కొన్నంత ఆయిల్‌ అమ్ముతాం: అమెరికా

ABN , Publish Date - May 23 , 2026 | 03:54 AM

భారత్‌ కొనగలిగినంత ఇంధనాన్ని తాము విక్రయిస్తామని అమెరికా విదేశాంగ మంత్రి రుబియో తెలిపారు. ఇంధన రంగంలో సహకారాన్ని...

భారత్‌ కొన్నంత ఆయిల్‌ అమ్ముతాం: అమెరికా

వాషింగ్టన్‌, మే 22: భారత్‌ కొనగలిగినంత ఇంధనాన్ని తాము విక్రయిస్తామని అమెరికా విదేశాంగ మంత్రి రుబియో తెలిపారు. ఇంధన రంగంలో సహకారాన్ని విస్తృతం చేసేందుకు భారతదేశంతో క్రియాశీల చర్చలు జరుపుతున్నట్లు చెప్పారు. శనివారం నుంచి 4రోజుల పాటు భారత్‌లో పర్యటించనున్న నేపథ్యంలో రుబియో మియామిలో మీడియాతో మాట్లాడారు. హోర్ముజ్‌ మూసివేత కారణంగా ఏర్పడిన అంతర్జాతీయ ఇంధన ఒత్తిళ్లను భారత్‌ సమర్థవంతంగా నిర్వహిస్తోందన్నారు. మార్కో రుబియో ఈ నెల 23 నుంచి 26 వరకు భారత్‌ పర్యటనలో భాగంగా ఢిల్లీతో పాటు కోల్‌కతా, ఆగ్రా, జైపూర్‌ తదితర నగరాల్లో పర్యటిస్తారు. భారత్‌ పర్యటనలో ప్రతిష్ఠాత్మక క్వాడ్‌ కూటమికి చెందిన మంత్రులతో సమావేశాలు ఉంటాయని మార్కో రుబియో తెలిపారు.

Updated Date - May 23 , 2026 | 03:54 AM