Share News

అమెరికాలో స్తంభించిన విమాన సేవలు

ABN , Publish Date - Nov 15 , 2026 | 03:07 AM

అమెరికాలో ఓ చిన్న సాంకేతిక సమస్య విమానయాన సేవలను కుదిపేసింది. టెలికమ్యూనికేషన్‌ వ్యవస్థలో డేటా ఓవర్‌లోడ్‌ కారణంగా ఎదురైన సాంకేతిక సమస్యతో విమానాల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది.

అమెరికాలో స్తంభించిన విమాన సేవలు

  • టెలికం వ్యవస్థలో డేటా ఓవర్‌లోడ్‌తో సమస్య.. 8వేల విమానాలు ఆలస్యం

వాషింగ్టన్‌: అమెరికాలో ఓ చిన్న సాంకేతిక సమస్య విమానయాన సేవలను కుదిపేసింది. టెలికమ్యూనికేషన్‌ వ్యవస్థలో డేటా ఓవర్‌లోడ్‌ కారణంగా ఎదురైన సాంకేతిక సమస్యతో విమానాల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. దేశవ్యాప్తంగా అన్ని విమానాశ్రయాల నుంచి బయల్దేరాల్సిన విమానాలను(సమారు 8,000) ఫెడరల్‌ ఏవియేషన్‌ అడ్మినిస్ట్రేషన్‌(ఎ్‌ఫఏఏ) శుక్రవారం రాత్రి నుంచి కొన్ని గంటలపాటు నిలిపివేసింది. సుమారు 15 లక్షల మంది ప్రయాణికులు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. విమాన రాకపోకల నియంత్రణ కేంద్రాలను(ఏటీసీ) అనుసంధానించే టెలికమ్యూనికేషన్‌ వ్యవస్థలో అంతరాయం ఏర్పడటంతో, భద్రత దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకున్నట్లు అధికారులు తెలిపారు. సుమారు నాలుగు గంటల అనంతరం సేవలను పునరుద్ధరించారు. పాతకాలం నాటి (1980) రౌటర్లు, రాగి తీగల వ్యవస్థపై అధిక డేటా భారం పడటంతో విమాన సర్వీసుల సమాచారం అస్థిరంగా మారిందని అమెరికా రవాణా శాఖ మంత్రి సీన్‌ డఫీ వెల్లడించారు. పాతకాలం నాటి వ్యవస్థను మార్చేందుకు కావాల్సిన నిధులను కాంగ్రెస్‌ ఇవ్వలేదని విమర్శించారు. అమెరికాలో చివరిసారి 2001సెప్టెంబర్‌ 11న(9/11 దాడి) దేశవ్యాప్తంగా విమానయాన సేవలను నిలిపివేయడం గమనార్హం.

Updated Date - Nov 15 , 2026 | 03:10 AM