Share News

దుబాయిలో ఘనంగా అంబేడ్కర్‌ జయంతి ఉత్సవాలు

ABN , Publish Date - Apr 17 , 2026 | 03:54 AM

అంబేడ్కర్‌ జయంతి ఉత్సవాలు పలు గల్ఫ్‌ దేశాల్లో ఘనంగా నిర్వహించారు. దుబాయిలో అంబేడ్కర్‌ సేవా సమితి అధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో తెలుగు దళితులు...

దుబాయిలో ఘనంగా అంబేడ్కర్‌ జయంతి ఉత్సవాలు

(ఆంధ్రజ్యోతి గల్ఫ్‌ ప్రతినిధి)

అంబేడ్కర్‌ జయంతి ఉత్సవాలు పలు గల్ఫ్‌ దేశాల్లో ఘనంగా నిర్వహించారు. దుబాయిలో అంబేడ్కర్‌ సేవా సమితి అధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో తెలుగు దళితులు... ప్రధానంగా అత్యధిక సంఖ్యలో మహిళలు పాల్గొన్నారు. యుద్ధ ఉద్రిక్త పరిస్థితుల మధ్య పెద్ద సంఖ్యలో గుమిగూడిన పేద మహిళలు ‘జై భీం’ అంటూ నినదించా రు. పాల్గొన్నవారిలో ఎక్కువమంది ఇళ్లలో పనులు చేస్తూ పొట్టపోసుకునే వారే. అందరూ స్వచ్ఛందంగా ముందుకొచ్చి విరాళాలిచ్చి కార్యక్రమాన్ని నిర్వహించారు. ఎల్లలు దాటి, ఆర్థిక స్వావలంబన సాధిస్తున్నా... స్వదేశంలో ఇంకా రాజకీయ, సామాజిక న్యాయం సాధించాల్సే ఉందని కార్యక్రమానికి అధ్యక్షత వహించిన సేవా సమితి అధ్యక్షుడు తరపట్ల మోహన్‌ అన్నారు. సాంబర్‌ మణి, గోసంగీ ధనలక్ష్మి, హెప్సిబా, సరిల్లా విజయ, చికిలే కుమారి, హాసినా, మారుమూడి సుఽధ, విజయ తదితరులు మాట్లాడారు. అంతకు ముందు దుబాయిలోని మరో రెండు ప్రాంతాల్లో జరిగిన ఉత్సవాల్లోనూ మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఖతర్‌, కువైత్‌ దేశాల్లోనూ తెలుగు దళితులు అంబేడ్కర్‌ జయంతి ఉత్సవాలను జరుపుకొన్నారు. అన్నిచోట్లా ఉభయ గోదావరి జిల్లాలకు చెందిన దళితులు అధిక సంఖ్యలో పాల్గొని తమ ప్రాబల్యాన్ని ప్రదర్శించారు.

Updated Date - Apr 17 , 2026 | 03:54 AM