అమెజాన్‌లో 16వేల ఉద్యోగాల కోత?
ABN , Publish Date - Jan 23 , 2026 | 05:22 AM
టెక్ దిగ్గజం అమెజాన్ వచ్చే వారంలో దాదాపు 16వేల ఉద్యోగాల కోతను ప్రకటించే అవకాశం ఉందన్న వార్తలు వస్తున్నాయి.
న్యూఢిల్లీ, జనవరి 22: టెక్ దిగ్గజం అమెజాన్ వచ్చే వారంలో దాదాపు 16వేల ఉద్యోగాల కోతను ప్రకటించే అవకాశం ఉందన్న వార్తలు వస్తున్నాయి. రానున్న నెలల్లో దాదాపు 30వేల ఉద్యోగుల తొలగింపు ఉంటుందని గత అక్టోబరులో రాయిటర్స్ వార్తా సంస్థ కథనం పేర్కొంది. మొదటి విడతలో 14వేల మందిని తొలగిస్తారని అప్పుడే అంచనా వేయగా అలాగే జరిగింది. ఇప్పుడు రెండో విడతగా ఈనెల 27 నుంచి దాదాపు 16వేల మందిని తొలగించవచ్చన్న ఊహాగానాలు వెలువడుతున్నాయి.