Share News

న్యూయార్క్‌కు ఎయిర్‌ఇండియా నాన్‌స్టా్‌ప సర్వీసులు పునఃప్రారంభం

ABN , Publish Date - Nov 16 , 2026 | 03:32 AM

భారత్‌ నుంచి అమెరికాలోని న్యూయార్క్‌కు ఎయిర్‌ఇండియా నాన్‌స్టా్‌ప విమాన సర్వీసులను పునఃప్రారంభించింది.

న్యూయార్క్‌కు ఎయిర్‌ఇండియా నాన్‌స్టా్‌ప సర్వీసులు పునఃప్రారంభం

న్యూఢిల్లీ, నవంబరు 15: భారత్‌ నుంచి అమెరికాలోని న్యూయార్క్‌కు ఎయిర్‌ఇండియా నాన్‌స్టా్‌ప విమాన సర్వీసులను పునఃప్రారంభించింది. ఢిల్లీ, ముంబయి నుంచి న్యూయార్క్‌కు వెళ్లే నాలుగు మార్గాల్లోనూ తిరిగి నేరుగా విమానాలను నడుపుతున్నట్లు ఆదివారం ప్రకటించింది. గతంలో గగనతల ఆంక్షలు, ప్రాంతీయ ఉద్రిక్తతల కారణంగా విమాన మార్గాలు ప్రభావితం కావడంతో... రోమ్‌లో ఇంధనం నింపుకొనేందుకు సాంకేతిక విరామం ఇవ్వాల్సి వచ్చింది. ఈ కారణంగా ఢిల్లీ, ముంబయిల నుంచి న్యూయార్క్‌లోని జాన్‌ ఎఫ్‌ కెన్నడీ (జేఎఫ్‌కే), నెవార్క్‌ (ఈడబ్ల్యూఆర్‌) విమానాశ్రయాలకు వెళ్లేందుకు ప్రయాణ సమయం దాదాపు 22 గంటలు పట్టేది. ప్రస్తుతం పరిస్థితులు అనుకూలించడంతో ఈ విరామం లేకుండానే నేరుగా విమానాలను నడుపుతోంది. దీంతో ప్రయాణ సమయం ఐదు గంటల వరకు తగ్గనుంది. సుమారు 17 గంటల్లోనే గమ్యస్థానానికి చేరుకోవచ్చు.

Updated Date - Nov 16 , 2026 | 03:32 AM