అప్ఘాన్‌లో గృహహింస చట్టబద్ధం!
ABN , Publish Date - Feb 20 , 2026 | 02:55 AM
అప్ఘానిస్థాన్‌లో తాలిబన్ ప్రభుత్వం కొత్తగా తెచ్చిన 90 పేజీల శిక్షాస్మృతి వివాదాస్పదంగా మారింది. ఇది గృహహింసను చట్టబద్ధం....
భార్యను ఎముకలు విరిగేలా కొడితేనే నేరం
న్యూఢిల్లీ, ఫిబ్రవరి 19: అప్ఘానిస్థాన్‌లో తాలిబన్ ప్రభుత్వం కొత్తగా తెచ్చిన 90 పేజీల శిక్షాస్మృతి వివాదాస్పదంగా మారింది. ఇది గృహహింసను చట్టబద్ధం చేస్తోందని, న్యాయవ్యవస్థలో అసమానతలకు ఆజ్యం పోసేలా ఉందని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఈ చట్టం ప్రకారం.. భార్య, పిల్లలపై పురుషులు భౌతిక దాడికి పాల్పడినప్పుడు వారి ఎముకలు విరగడం లేదా రక్తస్రావం కానంత వరకూ అది శిక్షార్హమైన నేరం కాదు. ఒకవేళ ఎముకలు విరిగినా ఆ విషయాన్ని బాధితురాలు కోర్టులో నిరూపిస్తే నిందితుడికి గరిష్ఠంగా 15రోజుల జైలుశిక్ష విధిస్తారు. భర్త నుంచి అనుమతి పొందకుండా బంధువులను కలిసే వివాహితకు 3 నెలల వరకూ జైలు శిక్ష విధించవచ్చు. తాలిబన్ల సుప్రీం లీడర్ హిబైతుల్లా అఖుంద్‌జాదా సంతకం చేసిన ఈ కొత్త చట్టంపై హక్కుల సంఘాలు, అంతర్జాతీయ పరిశీలకులు తీవ్ర విమర్శలు చేస్తున్నారు.