అడిడాస్ ఇండియాలో లేఆఫ్స్
ABN , Publish Date - Sep 17 , 2026 | 07:04 AM
క్రీడా సామగ్రి, దుస్తుల విభాగంలో ప్రముఖ సంస్థ అయిన అడిడాస్ భారతదేశంలో లేఆ్‌ఫలు ప్రకటించింది. గురుగ్రామ్‌లోని అడిడాస్ ఇండియా టెక్ హబ్‌లో..
న్యూఢిల్లీ, సెప్టెంబరు 16: క్రీడా సామగ్రి, దుస్తుల విభాగంలో ప్రముఖ సంస్థ అయిన అడిడాస్ భారతదేశంలో లేఆ్‌ఫలు ప్రకటించింది. గురుగ్రామ్‌లోని అడిడాస్ ఇండియా టెక్ హబ్‌లో పని చేస్తున్న సాఫ్ట్‌వేర్ ఇంజనీర్లు, డేటా సైంటిస్టులు, డేటా ఇంజనీర్ల తొలగింపునకు సిద్ధమైంది. గురుగ్రామ్‌లోని అడిదాస్ ఇండియా టెక్ హబ్‌లో దాదాపు 700 మంది పని చేస్తున్నారు. లేఆఫ్స్‌లో ఇందులో దాదాపు 50 శాతం అనగా 350 మంది వరకు ఉద్యోగాలు కోల్పోతున్నారని సమాచారం. లేఆ్‌ఫ్సపై సెప్టెంబరు 15నే అడిదాస్ తన ఉద్యోగులకు సమాచారం ఇచ్చినట్టు తెలిసింది.