పాక్, అఫ్ఘాన్‌లలో భూకంపం..ఢిల్లీలోనూ ప్రభావం
ABN , Publish Date - Apr 04 , 2026 | 04:28 AM
పాకిస్థాన్, అఫ్ఘానిస్థాన్‌లలో శుక్రవారం రాత్రి భూకంపం సంభవించింది. రెక్టర్ స్కేలుపై దాని తీవ్రత 6.3 పాయింట్లుగా నమోదయింది.
న్యూఢిల్లీ, ఏప్రిల్ 3: పాకిస్థాన్, అఫ్ఘానిస్థాన్‌లలో శుక్రవారం రాత్రి భూకంపం సంభవించింది. రెక్టర్ స్కేలుపై దాని తీవ్రత 6.3 పాయింట్లుగా నమోదయింది. అఫ్ఘానిస్థాన్‌లోని హిందూకుష్ పర్వత శ్రేణుల్లోని బాదక్షాన్ ప్రావిన్స్‌లో భూమికి 190 కిలోమీటర్ల లోపల భూకంప కేంద్రం నమోదయింది. ఇస్లామాబాద్, ఖైబర్-ఫఖ్తూంక్వా రాష్ట్రాల్లో దీని ప్రభావం కనిపించింది. అయితే ప్రాణ నష్టం జరిగినట్టు ఇంతవరకు ఎలాంటి సమాచారం అందలేదు. దీని ప్రభావం ఢిల్లీ-జాతీయ రాజధాని ప్రాంతంతో పాటు పలు ఉత్తరాది నగరాల్లో కనిపించింది.