Share News

మార్షల్‌ ఆర్ట్స్‌ ఇరగదీసిన చైనా రోబోలు!

ABN , Publish Date - Feb 25 , 2026 | 12:54 AM

టెక్నాలజీ విషయంలో చైనా ప్రపంచ దేశాలకు దాటేస్తూ దూసుకెళ్తోంది. తాజాగా చైనా హ్యూమనాయిడ్‌ రోబోలు చేసిన మార్షల్‌ ఆర్ట్స్‌ ప్రదర్శనే అందుకు నిదర్శనం...

మార్షల్‌ ఆర్ట్స్‌ ఇరగదీసిన చైనా రోబోలు!

  • బీజింగ్‌లో ఆకట్టుకున్న 49 రోబోల ప్రదర్శన

బీజింగ్‌, ఫిబ్రవరి 24: టెక్నాలజీ విషయంలో చైనా ప్రపంచ దేశాలకు దాటేస్తూ దూసుకెళ్తోంది. తాజాగా చైనా హ్యూమనాయిడ్‌ రోబోలు చేసిన మార్షల్‌ ఆర్ట్స్‌ ప్రదర్శనే అందుకు నిదర్శనం. ఇటీవల ముగిసిన చైనీస్‌ నూతన సంవత్సర వేడుకల సందర్భంగా బీజింగ్‌లోని టెంపుల్‌ ఆఫ్‌ హెవెన్‌లో 49 హ్యూమనాయిడ్‌ రోబోలు సింక్రొనైజ్డ్‌ మార్షల్‌ ఆర్ట్స్‌ ప్రదర్శనతో ఆకట్టుకున్నాయి. చైనీస్‌ రోబో కంపెనీ యూనిట్రీ విడుదల చేసిన ఈ 40 సెకన్ల వీడియో.. రోబోలు పంచ్‌లు, కిక్‌లు ఇస్తూ.. అత్యంత కష్టమైన పల్టీలు కొడుతూ అద్భుతమైన టైమింగ్‌తో మార్షల్‌ ఆర్ట్స్‌ ప్రదర్శించాయని గ్లోబల్‌ టైమ్స్‌ నివేదించింది. ఇవి ఏఐతో చేసినవి కాదు.. రోబోలు చేసిన నిజమైన షాట్లు.. అని పేర్కొంది. సోమవారం విడుదలైన ఈ వీడియోలో.. బీజింగ్‌లోని టెంపుల్‌ ఆఫ్‌ హెవెన్‌లోని హాల్‌ ఆఫ్‌ ప్రేయర్‌ ఫర్‌ గుడ్‌ హార్వెస్ట్‌ ముందు 49 జీ1 రోబోలు మార్షల్‌ ఆర్ట్స్‌ను ప్రదర్శించాయి. యూనిట్రీ జీ1 అనేది ఏఐ ఆదారితంగా రూపొందించిన మనిషిని పోలిన రోబో. ఇది చాలా చురుకుగా కదులుతుంది.

Updated Date - Feb 25 , 2026 | 12:54 AM