Share News

US Military Operation in Venezuela: 32 మంది క్యూబా అధికారులూ మృతి

ABN , Publish Date - Jan 06 , 2026 | 01:12 AM

వెనెజువెలా దేశంలో అమెరికా చేపట్టిన మిలిటరీ ఆపరేషన్‌లో 32 మంది క్యూబా అధికారులూ మరణించారు. క్యూబా ప్రభుత్వం ఆదివారం...

US Military Operation in Venezuela: 32 మంది క్యూబా అధికారులూ మృతి

  • వెనెజువెలాపై అమెరికా దాడిలో హతం

హవానా, జనవరి 5: వెనెజువెలా దేశంలో అమెరికా చేపట్టిన మిలిటరీ ఆపరేషన్‌లో 32 మంది క్యూబా అధికారులూ మరణించారు. క్యూబా ప్రభుత్వం ఆదివారం ఈ విషయాన్ని వెల్లడించింది. అయితే, ఆ సమయంలో క్యూబా అధికారులు వెనెజువెలాలో ఏం చేస్తున్నారన్న వివరాలను మాత్రం వెల్లడించలేదు. వెనెజువెలా క్యూబాకు మిత్రదేశం. వెనెజువెలా ప్రభుత్వ అభ్యర్థన మేరకు ఆ దేశంలో నిర్వహిస్తున్న ఒక మిషన్‌లో పాల్గొనేందుకు క్యూబా ప్రభుత్వం తమ మిలిటరీ, పోలీసు అధికారులను పంపింది. వెనెజువెలా ఏళ్ల తరబడి నిర్వహించే ఆపరేషన్లలో వీరు సహకారం అందిస్తున్నట్టు క్యూబా టీవీ చానళ్లు తాజాగా వెల్లడించాయి.

Updated Date - Jan 06 , 2026 | 01:12 AM