Share News

చిన్నతనంలో కూల్ డ్రింక్స్ ఎక్కువగా తాగితే పెద్దయ్యాక హైబీపీ రిస్క్!

ABN , Publish Date - Jun 22 , 2026 | 09:51 PM

చక్కెర ఎక్కువగా ఉన్న పానీయాలను చిన్నతనంలో అధికంగా తాగిన వారు పెద్దయ్యాక హైబీపీ బారిన పడ్డ వైనాన్ని తాము గుర్తించామని పరిశోధకులు తెలిపారు. ఈ అధ్యయనం తాలూకు వివరాలు సర్క్యూలేషన్ అనే జర్నల్‌లో తాజాగా ప్రచురితమయ్యాయి.

చిన్నతనంలో కూల్ డ్రింక్స్ ఎక్కువగా తాగితే పెద్దయ్యాక హైబీపీ రిస్క్!
Sugary Drinks-High BP Risk

ఇంటర్నెట్ డెస్క్: చక్కెర ఎక్కువగా ఉన్న పానీయాలు, ఫ్రూట్ జ్యూస్‌లను చిన్నతనంలో అధికంగా తాగిన వారిలో పెద్దయ్యాక రక్తపోటు రిస్క్ ఎక్కువయ్యే అవకాశం ఉందని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు. యూఎస్‌లో దాదాపు 25 వేల మందిపై పాతికేళ్లపాటు అధ్యయనం చేసిన అనంతరం ఈ అంచనాకు వచ్చారు. ఈ అధ్యయనం తాలూకు వివరాలు తాజాగా అమెరికన్ హార్ట్ అసోసియేషన్‌కు చెందిన సర్క్యులేషన్ జర్నల్‌లో ప్రచురితమయ్యాయి. హైబీపీ ఉన్న వారికి స్ట్రోక్, గుండె జబ్బుల ముప్పు ఎక్కువన్న విషయం తెలిసిందే.

పరిశోధకులు తెలిపిన వివరాల ప్రకారం, చిన్నతనంలో రోజుకు రెండు మూడు గ్లాసులకంటే (గ్లాసుకు 333 మిల్లీలీటర్ల డ్రింక్) ఎక్కువగా షుగరీ డ్రింక్స్ తాగే వారిలో హైబీపీ ముప్పు వారానికి మూడు గ్లాసులు తాగేవారితో పోలిస్తే 52 శాతం అధికంగా ఉన్నట్టు తేలింది. ముఖ్యంగా సోడాతో హైబీపీ ముప్పు 23 శాతం పెరిగితే, స్పోర్ట్స్ డ్రింక్స్‌తో ఈ ముప్పు 36 శాతం మేర పెరిగిందని చెప్పారు.


ఇక చిన్నతనంలో ఫ్రూట్ జ్యూస్‌లు అతిగా తాగినా కూడా హైబీపీ రిస్క్ పెరిగే ఛాన్స్ ఉందని పరిశోధకులు అంటున్నారు. రోజుకు 1.5 గ్లాసులకు పైగా ఫ్రూట్ జ్యూస్ తాగితే హైబీజీపీ రిస్క్ 35 శాతానికి పైగా పెరిగే ఛాన్స్ ఉందని చెప్పారు. చిన్నతనంలో ఆహారపు అలవాట్ల ప్రభావం దీర్ఘకాలికమైనదని పరిశోధకులు చెప్పారు. అయితే షుగరీ డ్రింక్స్‌ నేరుగా హైబీపీకి దారి తీస్తాయని చెప్పడం తమ ఉద్దేశం కాదని కూడా పరిశోధకులు చెప్పారు. హైబీపీ వెనక ఇతర కారణాలు కూడా ఉండి ఉండవచ్చని అన్నారు.


ఈ వార్తలనూ చదవండి:

ఆకలి లేకపోయినా తింటున్నారా? ఇది తెలుసుకోండి

ఉదయాన్నే నిద్రలేస్తే ఆరోగ్యానికి ఎన్నో లాభాలు

Updated Date - Jun 22 , 2026 | 10:42 PM