Share News

Avoid Use of Children Syrup: పిల్లల సిరప్‌ అల్మాంట్‌-కిడ్‌ను వాడొద్దు

ABN , Publish Date - Jan 11 , 2026 | 03:24 AM

పిల్లల కోసం వినియోగించే ‘అల్మాంట్‌-కిడ్‌’ సిర్‌పలో మోతాదుకు మించి ప్రమాదకర రసాయనాలు ఉన్నట్లు గుర్తించామని...

Avoid Use of Children Syrup: పిల్లల సిరప్‌ అల్మాంట్‌-కిడ్‌ను వాడొద్దు

  • ప్రమాదకర రసాయనాలున్నాయి: డీసీఏ డీజీ

హైదరాబాద్‌, జనవరి 10 (ఆంధ్రజ్యోతి) : పిల్లల కోసం వినియోగించే ‘అల్మాంట్‌-కిడ్‌’ సిర్‌పలో మోతాదుకు మించి ప్రమాదకర రసాయనాలు ఉన్నట్లు గుర్తించామని, ఆ సిర్‌పను వాడొద్దని ఔషధ నియంత్రణ మండలి(డీసీఏ) ప్రజలను హెచ్చరించింది. బిహార్‌కు చెందిన ట్రిడస్‌ రెమెడీస్‌ సంస్థ తయారుచేసిన ‘ఏఎల్‌-24002’ బ్యాచ్‌ సిర్‌పలలో కల్తీ జరిగినట్లు పశ్చిమబెంగాల్‌లో గుర్తించారని తెలిపింది. ఈ బ్యాచ్‌ సిరప్‌ ఎవరి వద్దనైనా ఉంటే వెంటనే వాడకాన్ని నిలిపివేయాలని, మార్కెట్‌లో కూడా దీని విక్రయాలను నిలిపివేయాలని డీసీఏ డైరెక్టర్‌ జనరల్‌ షానవాజ్‌ ఖాసీం ఆదేశించారు.

Updated Date - Jan 11 , 2026 | 03:24 AM