Share News

ఓఎన్‌జీసీ స్కాలర్‌షిప్స్‌

ABN , Publish Date - May 04 , 2026 | 01:23 AM

అయిల్‌ అండ్‌ నేచురల్‌ గ్యాస్‌ కార్పొరేషన్‌ (ఓఎన్‌జీసీ) లిమిటెడ్‌ 2025-26 అంటే నడుస్తున్న విద్యాసంవత్సరానికి సంబంధించి స్కాలర్‌షి్‌ప్సకు నోటిఫికేషన్‌ విడుదల చేసింది...

ఓఎన్‌జీసీ స్కాలర్‌షిప్స్‌

అయిల్‌ అండ్‌ నేచురల్‌ గ్యాస్‌ కార్పొరేషన్‌(ఓఎన్‌జీసీ) లిమిటెడ్‌ 2025-26 అంటే నడుస్తున్న విద్యాసంవత్సరానికి సంబంధించి స్కాలర్‌షి్‌ప్సకు నోటిఫికేషన్‌ విడుదల చేసింది.

స్కాలర్‌షిప్స్‌: ఏటా 2000. ఇందులో ఎస్సీ, ఎస్టీ 1000, ఓబీసీ 500. జనరల్‌ 500. అన్ని విభాగాల్లో 50 శాతం అంటే మొత్తమ్మీద వెయ్యి స్కాలర్‌షిప్స్‌ మహిళలకు లభిస్తాయి. ఎంపికైన వారికి నెలకు రూ.4000 చొప్పున ఏడాదికి రూ.48,000 లభిస్తాయి.

అర్హత: ఏదైనా విద్యాసంస్థలో ఫుల్‌టైమ్‌ కోర్సును రెగ్యులర్‌ విధానంలో చదువుతూ ఉండాలి. బీఈ/బీటెక్‌, మెడిసిన్‌, పీజీ స్థాయిలో జియాలజీ జియోఫిజిక్స్‌/ ఎంబీఎ చదువుతూ ఉండాలి. ముఖ్యంగా ప్రస్తుత విద్యాసంవత్సరంలోనే చేరి ఉండాలి. చేస్తున్న కోర్సుకు ఉద్దేశించిన అర్హత పరీక్షలో కనీసం 60 శాతం మార్కులు ఇంటర్‌/ డిగ్రీలో పొంది ఉండాలి. వయస్సు 2025 ఆగస్టు 1 నాటికి 30 సంవత్సరాలకు మించ కూడదు. ఇంతవరకు ఏ స్కాలర్‌షి్‌పనకు ఎంపికై ఉండరాదు.

దరఖాస్తుకు ఆఖరు తేదీ: మే 15

వెబ్‌సైట్‌: scholarships.gov.in/ (NSP portal)

ఈ వార్తలు కూడా చదవండి

బాలుడి చేతిలో పేలిన బ్యాటరీ.. తెగిపడిన వేళ్లు..

సిద్దిపేట జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఇద్దరి మృతి

Updated Date - May 04 , 2026 | 01:24 AM