Share News

జాబ్‌ కార్నర్‌

ABN , Publish Date - May 04 , 2026 | 01:31 AM

స్టెనోగ్రాఫర్‌ రిక్రూట్‌మెంట్‌, కరెన్సీ నోట్‌ ప్రెస్‌, బ్యాంక్‌ ఆఫ్‌ బరోడా, కంబైన్డ్‌ హిందీ ట్రాన్స్‌లేటర్‌ ఎగ్జామినేషన్‌....

జాబ్‌ కార్నర్‌

జాబ్‌ కార్నర్‌

స్టెనోగ్రాఫర్‌ రిక్రూట్‌మెంట్‌

స్టాఫ్‌ సెలక్షన్‌ కమిషన్‌ (ఎస్ఎస్ సీ) - స్టెనోగ్రాఫర్‌ గ్రేడ్‌-సి, గ్రేడ్‌-డి ఉద్యోగాల కోసం నోటిఫికేషన్‌ విడుదల చేసింది. కేంద్ర ప్రభుత్వంలోని వివిధ మంత్రిత్వ శాఖలు విభాగాలు, సంస్థల్లో 731 స్టెనోగ్రాఫర్‌ పోస్టుల భర్తీకి దీనిని ఉద్దేశించారు.

అర్హత: ఇంటర్‌ లేదా తత్సమాన పరీక్ష ఉత్తీర్ణతకు తోడు స్టెనోగ్రఫీలో నైపుణ్యం ఉండాలి.

ఎంపిక: కంప్యూటర్‌ ఆధారిత పరీక్ష 200 మార్కులకు ఉంటుంది. రాతపరీక్షలో క్వాలిఫై అయిన వారికి అభ్యర్థులు ఎంచుకున్న ప్రకారం హిందీ లేదా ఇంగ్లీ్‌షలో స్టెనోగ్రపి టెస్ట్‌ ఉంటుంది. చివరగా అభ్యర్థి డాక్యుమెంట్లను కూడా పరిశీలించి తుది ఎంపిక జరుపుతారు.

దరఖాస్తుకు ఆఖరు తేదీ: మే 15

కరెన్సీ నోట్‌ ప్రెస్‌

నాసిక్‌లోని కరెన్సీ నోట్‌ ప్రెస్‌ వివిధ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ విడుదల చేసింది. దీని పరిధిలోని నాలుగు యూనిట్లు - సీఎన్‌పీ నాసిక్‌, ఐఎ్‌సపీఎన్‌ నాసిక్‌, బీఎన్‌పీ దేవాస్‌, ఎస్‌పీపీ హైదరాబాద్‌లో ఈ పోస్టులు ఉన్నాయి. 534 పోస్టులకు గాను 69 ఖాళీలు ఎస్‌పీపీ హైదరాబాద్‌లోనే ఉన్నాయి.

పోస్టులు: సేఫ్టీ ఆఫీసర్‌, వెల్ఫేర్‌ ఆఫీసర్‌, సూపర్వైజర్‌(టెక్నిల్‌ కంట్రోల్‌/ ఐటీ/ సివిల్‌ తదితరాలు) ఆర్టి్‌స్ట(గ్రాఫిక్‌ డిజైన్‌), సెక్రటేరియల్‌ అసిస్టెంట్‌, జూనియర్‌ ఆఫీస్‌ అసిస్టెంట్‌, జూనియర్‌ టెక్నీషియన్‌(ప్రింటింగ్‌/ కంట్రోల్‌/ ఎలక్ట్రికల్‌/ ఫిట్టర్‌ తదితరాలు) ఉన్నాయి. పోస్టుకు తగ్గట్టు అర్హతలు ఉండాలి.

ఎంపిక: కంప్యూటర్‌ ఆధారిత టెస్ట్‌ ద్వారా ఎంపిక చేస్తారు. కొన్ని పోస్టులకు ఆదనంగా స్కిల్‌ టెస్ట్‌ కూడా ఉంటుంది.

దరఖాస్తుకు ఆఖరు తేదీ: మే 19

వెబ్‌సైట్‌: cnpnashik.spmcil.com

బ్యాంక్‌ ఆఫ్‌ బరోడా

బ్యాంక్‌ ఆఫ్‌ బరోడా స్పోర్ట్స్‌మన్‌ కోటా కింద 30 క్లరికల్‌ కేడర్‌ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ విడుదల చేసింది.

ఖాళీల వివరాలు: క్రికెట్‌ 9, కబడ్డీ 11, టేబుల్‌ టెన్నిస్‌ 2, ఫుట్‌బాల్‌ 8(కబడ్డీ 5, టేబుల్‌ టెన్ని్‌సలో ఒకటి మహిళలకు కేటాయించారు)

అర్హతలు: డిగ్రీ ఉత్తీర్ణులై ఉండాలి. అంతర్జాతీయ/ జాతీయ లేదా జూనియర్‌ నేషనల్‌ చాంపియన్‌షిప్‌, ఖేలో ఇండియా గేమ్స్‌లో మెడల్‌ విన్నర్లు అయి ఉండాలి.

ఎంపిక: షార్ట్‌లిస్టింగ్‌, ఫీల్డ్‌ ట్రయల్స్‌ ఆధారంగా

దరఖాస్తుకు చివరి తేదీ: మే 12

వెబ్‌సైట్‌: www.bankofbaroda.bank.in


కంబైన్డ్‌ హిందీ ట్రాన్స్‌లేటర్‌ ఎగ్జామినేషన్‌

కంబైన్డ్‌ హిందీ ట్రాన్స్‌లేటర్స్‌ ఎగ్జామినేషన్‌ ద్వారా 84 ఖాళీల భర్తీకి ఎస్‌ఎ్‌ససీ మరో నోటిఫికేషన్‌ విడుదల చేసింది. కేంద్ర ప్రభుత్వ మంత్రిత్వ శాఖలు, విభాగాల్లో ఈ పోస్టులు ఉన్నాయి.

పోస్టులు: జూనియర్‌ ట్రాన్స్‌లేషన్‌ ఆఫీసర్‌, జూనియర్‌ హిందీ ట్రాన్స్‌లేటర్‌, జూనియర్‌ ట్రాన్స్‌లేటర్‌, సీనియర్‌ హిందీ ట్రాన్స్‌లేటర్‌, సీనియర్‌ ట్రాన్స్‌లేషన్‌ ఆఫీసర్‌

అర్హతలు: పోస్టును అనుసరించి హిందీలో పీజీకి తోడు డిగ్రీ స్థాయిలో ఇంగ్లీష్‌ నిర్దేశించిన పద్ధతిలో చదివి ఉండాలి.

ఎంపిక: వంద మార్కులకు ఆబ్జెక్టివ్‌, మరో వంద మార్కులకు డిస్ర్కిప్టివ్‌ పేపర్లు ఉంటాయి. పరీక్ష కాలవ్యవధి చెరి రెండు గంటలు.

దరఖాస్తుకు చివరి తేదీ: మే 14

వెబ్‌సైట్‌: https://ssc.gov.in

ఈ వార్తలు కూడా చదవండి

బాలుడి చేతిలో పేలిన బ్యాటరీ.. తెగిపడిన వేళ్లు..

సిద్దిపేట జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఇద్దరి మృతి

Updated Date - May 04 , 2026 | 01:31 AM