Share News

జేఈఈ మెయిన్స్‌ ఫలితాల్లో తిరుమల ప్రభంజనం

ABN , Publish Date - Apr 22 , 2026 | 04:57 AM

కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన జేఈఈ మెయిన్స్‌-2026 ఫలితాల్లో తూర్పుగోదావరి జిల్లా కాతేరులోని తిరుమల విద్యాసంస్థ ఐఐటీ అండ్‌ మెడికల్‌ అకాడమీ విద్యార్థులు ప్రభంజనం సృష్టించారు.

జేఈఈ మెయిన్స్‌ ఫలితాల్లో తిరుమల ప్రభంజనం

రాజమహేంద్రవరం రూరల్‌, ఏప్రిల్‌ 21(ఆంధ్రజ్యోతి): కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన జేఈఈ మెయిన్స్‌-2026 ఫలితాల్లో తూర్పుగోదావరి జిల్లా కాతేరులోని తిరుమల విద్యాసంస్థ ఐఐటీ అండ్‌ మెడికల్‌ అకాడమీ విద్యార్థులు ప్రభంజనం సృష్టించారు. ఈ సందర్భంగా చైర్మన్‌ నున్న తిరుమలరావు మాట్లాడుతూ తమ విద్యార్థి డి.శ్రీవేద్‌ మెడికల్‌ విభాగంలో ఎస్సీ కేటగిరిలో ఆలిండియా ఫస్ట్‌, ఓపెన్‌ కేటగిరిలో 34వ ర్యాంక్‌ సాధించారన్నారు. ఓపెన్‌ కేటగిరిలో వెయ్యిలోపు 17 మంది ర్యాంకులు సాధించారని తెలిపారు. వివిధ కేటగిరీల్లో జాతీయ స్థాయిలో తమ విద్యార్థులు బి.కౌశల్‌ 3వ ర్యాంక్‌, వై.సత్యసాత్విక్‌ నాయుడు 10వ ర్యాంక్‌, కొమ్మోజు జస్మిత 17వ ర్యాంక్‌, బి.వెంకటరమణ 18వ ర్యాంక్‌ సాధించారని చెప్పారు. వీటితో పాటు తమ విద్యార్థులు 30, 37, 38, 54, 56, 66, 73, 77, 86, 87, 92, 93, 99 ర్యాంకులు సాధించారని వెల్లడించారు. వెయ్యిలోపు 93, 5వేల లోపు 386, 10వేల లోపు 658, 20వేల లోపు 4065 ర్యాంక్‌లు సాధించారని తెలిపారు. కోచింగ్‌ తీసుకున్న 4092 మంది విద్యార్థుల్లో అడ్వాన్స్‌డ్‌ పరీక్షకు అర్హత పొందిన వారు 91శాతం సక్సెస్‌ రేటు సాధించారని తిరుమలరావు తెలిపారు. ర్యాంక్‌లు సాధించిన విద్యార్థులను ఆయన అభినందించారు.

Updated Date - Apr 22 , 2026 | 04:58 AM