Share News

ఇండియన్‌ కలినరీ యూనివర్సిటీ

ABN , Publish Date - Apr 27 , 2026 | 06:44 AM

ఇందిరా గాంధీ నేషనల్‌ ట్రైబల్‌ యూనివర్సిటీ సహకారంతో ఇండియన్‌ కలినరీ యూనివర్సిటీ - బీబీఏ, ఎంబీఏ కోర్సులకు ప్రకటన విడుదల చేసింది. తిరుపతి, నోయిడా క్యాంప్‌సలలో...

ఇండియన్‌ కలినరీ యూనివర్సిటీ

ఇందిరా గాంధీ నేషనల్‌ ట్రైబల్‌ యూనివర్సిటీ సహకారంతో ఇండియన్‌ కలినరీ యూనివర్సిటీ - బీబీఏ, ఎంబీఏ కోర్సులకు ప్రకటన విడుదల చేసింది. తిరుపతి, నోయిడా క్యాంప్‌సలలో ఈ కోర్సులను ఆఫర్‌ చేస్తున్నారు.

  • బీబీఏలో ఒక్కో క్యాంప్‌సలో 120 సీట్లు ఉన్నాయి. కనీసం 45 శాతం మార్కులతో ఇంటర్‌ ఉత్తీర్ణులు అర్హులు. సీయూఈటీ(యూజీ) 2026 స్కోర్‌ లేదా ఐసీఐ నిర్వహించే ఐజీఎన్‌టీయూజేఈఈ(యూజీ) 2026 స్కోర్‌ తదితరాల ఆధారంగా సీట్ల కేటాయింపు ఉంటుంది.

  • ఎంబీఏలో ఒక్కో క్యాంపస్‌లో 30 సీట్లు ఉన్నాయి. కనీసం 45 శాతం మార్కులతో డిగ్రీ ఉత్తీర్ణులు అర్హులు. సీయూఈటీ(పీజీ) 2026 స్కోర్‌ లేదా ఐసీఐ నిర్వహించే ఐజీఎన్‌టీయూజేఈఈ(పీజీ) 2026 స్కోర్‌ తదితరాల ఆధారంగా సీట్ల కేటాయింపు ఉంటుంది.

  • రెండో రౌండ్‌ దరఖాస్తుల స్వీకరణ ఆరంభమైంది. మే 20తో ముగుస్తుంది. మూడో రౌండ్‌ మే 29తో ఆరంభమై జూన్‌ 19తో పూర్తవుతుంది. అకడమిక్‌ సెషన్‌ జూలై 15 నుంచి ఆరంభమవుతుంది.

వెబ్‌సైట్‌: www.icitirupati.in

సిపెట్‌

భువనేశ్వర్‌లోని సెంట్రల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ పెట్రోకెమికల్స్‌ ఇంజనీరింగ్‌ అండ్‌ టెక్నాలజీ(సిపెట్‌) వచ్చే విద్యా సంవత్సరానికి బీటెక్‌, ఎంటెక్‌, ఎమ్మెస్సీ కోర్సుల్లో ప్రవేశాలకు దరఖాస్తులు ఆహ్వానిస్తోంది.

  • బీటెక్‌ ప్లాసిక్స్‌ ఇంజనీరింగ్‌, మాన్యుఫాక్చరింగ్‌ ఇంజనీరింగ్‌ అండ్‌ టెక్నాలజీ - కనీసం 45 శాతం మార్కులతో ఫిజిక్స్‌, కెమిస్ట్రీ, మ్యాథమెటిక్స్‌ సబ్జెక్టులుగా ఇంటర్‌ లేదా తత్సమాన పరీక్ష ఉత్తీర్ణులు కావాలి.

  • ఎంటెక్‌ ప్లాస్టిక్స్‌ ఇంజనీరింగ్‌, పాలిమర్‌ నానో టెక్నాలజీ - సంబంధిత ఇంజనీరింగ్‌లో బీఈ/బీటెక్‌ లేదా కనీసం 50 శాతం మార్కులతో ఎమ్మెస్సీ ఉత్తీర్ణులై ఉండాలి.

  • ఎమ్మెస్సీ పాలిమర్‌ సైన్స్‌ - కెమిస్ట్రీ ఒక సబ్జెక్టుగా బీఎస్సీ డిగ్రీ ఉత్తీర్ణులై ఉండాలి.

  • ఈ కోర్సుల్లో ప్రవేశానికి ఉద్దేశించిన పరీక్ష మే 29న నిర్వహిస్తున్నారు. ఆసక్తికి తోడు అర్హతలు ఉన్న విద్యార్థులు మే 25లోపు దరఖాస్తు చేసుకోవాలి.

వెబ్‌సైట్‌: www.cipet.gov.in/


జిప్‌మ్యాట్‌

ఐఐఎం బోధ్‌గయ, ఐఐఎం జమ్ము అందిస్తున్న ఇంటిగ్రేటెడ్‌ ప్రోగ్రామ్‌ ఇన్‌ మేనేజ్‌మెంట్‌ కోర్సులో ప్రవేశానికి ఉద్దేశించిన జాయింట్‌ ఇంటిగ్రేటెడ్‌ ప్రోగ్రామ్‌ ఇన్‌ మేనేజ్‌మెంట్‌ అడ్మిషన్‌ టెస్ట్‌(జి్‌పమ్యాట్‌)-2026కి నోటిఫికేషన్‌ను నేషనల్‌ టెస్టింగ్‌ ఏజెన్సీ విడుదల చేసింది.

  • మాస్ట్‌ర్‌ ఆఫ్‌ బిజినెస్‌ అడ్మినిస్ట్రేషన్‌, పీహెచ్‌డీ ప్రోగ్రామ్‌ ఇన్‌ మేనేజ్‌మెంట్‌, ఇంటిగ్రేటెడ్‌ ప్రోగ్రామ్‌ ఇన్‌ మేనేజ్‌మెంట్‌ల్లో ప్రవేశాన్ని పొందవచ్చు.

  • కనీసం 60 శాతం మార్కులతో ఇంటర్‌ లేదా తత్సమాన పరీక్ష ఉత్తీర్ణులు ఈ కోర్సు చేయవచ్చు. ఈ ఏడాదికి తోడు 2024, 2025 సంవత్సరాల్లో అర్హత పరీక్ష రాసిన విద్యార్థులు ఈ టెస్టు రాయవచ్చు. ప్రవేశ పరీక్ష ఆధారంగా సీట్లు లభిస్తాయి.

  • ప్రవేశ పరీక్ష పూర్తిగా కంప్యూటర్‌ ఆధారిత పరీక్ష. 150 నిమిషాలు అంటే గంటన్నర కాలవ్యవధి కలిగిన పరీక్ష. క్వాంటిటేటివ్‌ ఆప్టిట్యూడ్‌ నుంచి 33, డేటా ఇంట్రప్రిటేషన్‌ అండ్‌ లాజికల్‌ రీజనింగ్‌ నుంచి 33, వెర్బల్‌ ఎబిలిటీ అండ్‌ రీడింగ్‌ కాంప్రహెన్షన్‌ నుంచి 34 మొత్తం 100 ప్రశ్నలు వస్తాయి. సమాధానం కరెక్ట్‌గా గుర్తిస్తే ఒక్కో ప్రశ్నకు 4 మార్కులు వస్తాయి. తప్పుగా గుర్తిస్తే ఒక మార్కు కట్‌ అవుతుంది. మే10లోపు దరఖాస్తు చేసుకోవాలి.

వెబ్‌సైట్‌: exams.nta.nic.in/jipmat/

ములుగు గిరిజన యూనివర్సిటీ

ఐఐటీ హైదరాబాద్‌తో కుదుర్చుకున్న ఒప్పందం మేరకు ములుగులోని సమ్మక్క సారక్క కేంద్రీయ గిరిజన విశ్వవిద్యాలయం వివిధ కోర్సుల్లో ప్రవేశానికి నోటిఫికేషన్‌ విడుదల చేసింది.

  • బీటెక్‌ - కంప్యూటర్‌ సైన్స్‌ అండ్‌ ఆర్టిఫీషియల్‌ ఇంటెలిజెన్స్‌ - కోర్సు కాలవ్యవధి నాలుగేళ్ళు - ఫీజు సెమిస్టర్‌కు రూ.32,000

  • బీఎస్సీ(ఆనర్స్‌) - కంప్యూటర్‌ సైన్స్‌ అండ్‌ డేటా అనలిటిక్స్‌ - నాలుగేళ్ళు - మూడేళ్ళ కోర్సు పూర్తి చేసుకుంటే బీఎస్సీ డిగ్రీ ఇచ్చే వెసులుబాటు కల్పించారు - ఫీజు సెమిస్టర్‌కు రూ.24,000

  • బీఎస్సీ(ఆనర్స్‌) - మ్యాథమెటిక్స్‌ అండ్‌ కంప్యూటింగ్‌ - నాలుగేళ్ళు - ఫీజు సెమిస్టర్‌కు రూ.24,000.

  • కనీసం 60 శాతం మార్కులతో మ్యాథ్స్‌, ఫిజిక్స్‌, కెమిస్ట్రీ సబ్జెక్టులతో ఇంటర్‌ లేదా తత్సమాన పరీక్ష ఉత్తీర్ణులై ఉండాలి. సీయూఈటీ యూజీలో అర్హత సాధించాలి లేదా జేఈఈ మెయిన్‌ స్కోర్‌తోనూ దరఖాస్తు చేసుకోవచ్చు. మ్యాథమెటిక్స్‌ అండ్‌ కంప్యూటింగ్‌ కోర్సులో ప్రవేశానికి ఎంఈసీతో ఇంటర్‌ చేసిన విద్యార్థులూ అర్హులే. మరిన్ని వివరాలకు 9966367835 నెంబర్‌లో సంప్రదించవచ్చు.

వెబ్‌సైట్‌: https://ssctu.ac.in/

ఈ వార్తలు కూడా చదవండి..

అంతర్జాతీయ టెక్ మ్యాప్‌లో విశాఖకు చోటు

రుద్రంపేట ఘటనపై రాయపాటి శైలజ ఆరా

For More AP News And Telugu News

Updated Date - Apr 27 , 2026 | 06:44 AM