Share News

జాబ్‌ కార్నర్‌ 25 05 2026

ABN , Publish Date - May 25 , 2026 | 05:22 AM

ఎస్‌ఎస్‌సీ సీజీఎల్‌ యూపీఎస్సీ ఎన్‌డీఏ, ఎన్‌ఏ రైల్వేలో అసిస్టెంట్‌ లోకో పైలెట్‌...

జాబ్‌ కార్నర్‌ 25 05 2026

జాబ్‌ కార్నర్‌

ఎస్‌ఎస్‌సీ సీజీఎల్‌

స్టాఫ్‌ సెలక్షన్‌ కమిషన్‌(ఎస్‌ఎస్‌సీ) - కంబైన్డ్‌ గ్రాడ్యుయేట్‌ లెవెల్‌(సీజీఎల్‌) 2026కి నోటిఫికేషన్‌ విడుదల చేసింది. కేంద్ర ప్రభుత్వంలోని వివిధ మంత్రిత్వ శాఖలు, విభాగాలు, సంస్థల్లోని గ్రూప్‌ బి, గ్రూప్‌ సికి చెందిన 12,256(తాత్కాలిక సంఖ్య) పోస్టుల భర్తీకి ఈ నోటిఫికేషన్‌ను ఉద్దేశించారు. అసిస్టెంట్‌ ఆడిట్‌ ఆపీసర్‌, అసిస్టెంట్‌ సెక్షన్‌ ఆఫీసర్‌, ఇన్‌స్పెక్టర్‌, సబ్‌ ఇన్‌స్పెక్టర్‌, ఆడిటర్‌, అకౌంటెంట్‌ తదితర పోస్టులను భర్తీ చేయనున్నారు.

విద్యార్హతలు: డిగ్రీ ఉత్తీర్ణులు అర్హులు. అయితే కొన్ని పోస్టులకు డిగ్రీకి తోడు ప్రత్యేక అర్హతలను నిర్దేశించారు.(ఆఖరు సంవత్సరం డిగ్రీ చదువుతున్న విద్యార్థులు సైతం దరఖాస్తు చేసుకోవచ్చు)

ఎంపిక: రెండు దశల్లో కంప్యూటర్‌ బేస్డ్‌ ఎగ్జామినేషన్‌, డాక్యుమెంట్‌ వెరిఫికేషన్‌ ఆధారంగా

ఆఖరు తేదీ: జూన్‌ 22

వెబ్‌సైట్‌: ssc.gov.in

యూపీఎస్సీ ఎన్‌డీఏ, ఎన్‌ఏ

యూపీఎస్సీ నేషనల్‌ డిఫెన్స్‌ అకాడమీ అండ్‌ నేవల్‌ అకాడమీ (ఎన్‌డీఏ ఎన్‌ఏ)(2) పరీక్షకు యూపీఎస్సీ నోటిఫికేషన్‌ విడుదల చేసింది.

మొత్తం పోస్టులు : 394

నేషనల్‌ డిఫెన్స్‌ అకాడమీ: ఆర్మీ వింగ్‌ 208 - పురుషులు 198 మహిళలు 10; నేవీ వింగ్‌ 42(ఎగ్జిక్యూటివ్‌ బ్రాంచ్‌) పురుషులు 37, మహిళలు 5)

ఎయిర్‌ ఫోర్స్‌ వింగ్‌: 120 ఫ్లయింగ్‌ బ్రాంచ్‌-92, గ్రౌండ్‌ డ్యూటీ(టెక్‌)- 18, గ్రౌండ్‌ డ్యూటీ(నాన్‌-టెక్‌)- 10 (ఒక్కో దానిలో రెండు పోస్టులను మహిళలకు ప్రత్యేకించారు)

నేవల్‌ అకాడమీ(10+2 క్యాడెట్‌ ఎంట్రీ స్కీమ్‌)-24(మహిళలకు 3)

అర్హత: ఏ గ్రూప్‌తోనైనా ఇంటర్‌ ఉత్తీర్ణత. ఇండియన్‌ నేవల్‌ అకాడమీ(10+2 క్యాడెట్‌ ఎంట్రీ స్కీమ్‌)కి మాత్రం ఫిజిక్స్‌, మ్యాథ్స్‌ సబ్జెక్టులతో ఇంటర్‌ లేదా తత్సమాన పరీక్ష ఉత్తీర్ణులై ఉండాలి

ఎంపిక: రాత పరీక్ష, ఇంటెలిజెన్స్‌-పర్సనాలిటీ టెస్ట్‌, ఎస్‌ఎస్‌బీ టెస్ట్‌/ ఇంటర్వ్యూ, మెడికల్‌ టెస్ట్‌ ఆధారంగా.

దరఖాస్తుకు ఆఖరు తేదీ: జూన్‌ 9

వెబ్‌సైట్‌: https://upsc.gov.in

రైల్వేలో అసిస్టెంట్‌ లోకో పైలెట్‌

రైల్వే రిక్రూట్‌మెంట్‌ బోర్డ్‌ - దేశవ్యాప్తంగా వివిధ జోన్లలో ఉన్న 11,127 అసిస్టెంట్‌ లోకో పైలెట్‌ పోస్టులకు దరఖాస్తులు కోరుతోంది.

అర్హత: పదో తరగతికి తోడు నిర్దేశిత ట్రేడ్స్‌/ బ్రాంచీల్లో ఐటీఐ/ అప్రెంటిస్‌షిప్‌/ డిప్లొమా/ బీటెక్‌ ఉత్తీర్ణులై ఉండాలి.

ఎంపిక: రెండ దశల్లో కంప్యూటర్‌ ఆధారిత పరీక్ష, కంప్యూటర్‌ ఆధారిత ఆప్టిట్యూడ్‌ టెస్ట్‌, డాక్యుమెంట్స్‌ వెరిఫికేషన్‌, మెడికల్‌ ఎగ్జామినేషన్‌ ఆధారంగా.

దరఖాస్తుకు చివరి తేదీ: జూన్‌ 14

అన్ని రీజియన్లలో 6565 టెక్నీషియన్‌ పోస్టులు ఉన్నాయి.

పోస్టులు: టెక్నీషియన్‌ గ్రేడ్‌-1 సిగ్నల్‌ 323, టెక్నీషియన్‌ గ్రేడ్‌-111 సిగ్నల్‌ 6242

అర్హత: టెన్త్‌, ఐటీఐ, బీఎస్సీ లేదా డిగ్రీ/ డిప్లొమా ఉత్తీర్ణత

ఎంపిక: కంప్యూటర్‌ ఆధారిత పరీక్ష, డాక్యుమెంట్స్‌ పరిశీలన, మెడికల్‌ ఎగ్జామినేషన్‌ తదితరాల ఆధారంగా.

దరఖాస్తుకు ఆఖరు తేదీ: జూన్‌ 30 నుంచి జూలై 29 వరకు

వెబ్‌సైట్‌: www.rrbsecunderabad.gov.in for applying secunderabad zone.

Updated Date - May 25 , 2026 | 05:23 AM