కల్చరల్ టాలెంట్ సెర్చ్ స్కాలర్‌షిప్ స్కీమ్
ABN , Publish Date - May 11 , 2026 | 04:51 AM
భారత ప్రభుత్వ సాంస్కృతిక మంత్రిత్వశాఖ పరిధిలోని సెంటర్ ఫర్ కల్చరల్ రిసోర్సెస్ అండ్ ట్రైనింగ్(సీసీఆర్‌టీ) రానున్న విద్యా సంవత్సరానికి కల్చరల్ టాలెంట్ సెర్చ్....
భారత ప్రభుత్వ సాంస్కృతిక మంత్రిత్వశాఖ పరిధిలోని సెంటర్ ఫర్ కల్చరల్ రిసోర్సెస్ అండ్ ట్రైనింగ్(సీసీఆర్‌టీ) రానున్న విద్యా సంవత్సరానికి కల్చరల్ టాలెంట్ సెర్చ్ స్కాలర్‌షిప్ స్కీమ్‌ని ప్రకటించింది.
సంగీతం, నృత్యం, నాటకం, చిత్రలేఖనం, శిల్పకళ, సాహిత్య రంగాల్లో ప్రతిభ కనబరిచే పది నుంచి పద్నాలుగు సంవత్సరాల లోపు బాలలకు ఈ స్కాలర్‌షిప్‌ను అందిస్తారు.
మొత్తం ఇవి 650 కాగా సంప్రదాయ కళాకారుల కుటుంబాలు సహా ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులకు తోడు ప్రత్యేక వర్గాలకు నిబంధనల మేరకు రిజర్వేషన్ ఉంది.
గుర్తింపు పొందిన పాఠశాలలో చదువుతున్న బాలలు మాత్రమే దరఖాస్తుకు అర్హులు. 2012 జూలై 1 - 2016 జూన్ 30 మధ్య(రెండు తేదీలు సహా) ఈ బాలలు జన్మించి ఉండాలి
వెబ్‌సైట్ నుంచి దరఖాస్తును ఉచితంగా డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. మే 31లోగా దరఖాస్తు చేసుకోవాలి.
వెబ్‌సైట్: www.ccrtindian.gov.in
ఇవి కూడా చదవండి:
రషీద్ ఖాన్ ఖాతాలో మరో అరుదైన మైలురాయి
ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించిన పాకిస్థాన్ స్టార్ ప్లేయర్