సీబీఎస్ఈ రీ-వాల్యుయేషన్.. బ్యాంక్ ఖాతా లేకున్నా పేమెంట్ చేయవచ్చు
ABN , Publish Date - Jun 03 , 2026 | 04:45 PM
సీబీఎస్ఈ రీ-వాల్యుయేషన్, వెరిఫికేషన్ దరఖాస్తుల కోసం చెల్లింపులు చేసే విద్యార్థులకు బోర్డు కీలక సమాచారం వెల్లడించింది. పలు బ్యాంకుల పేమెంట్ గేట్‌వేలు అందుబాటులో ఉన్నాయని, ఆయా బ్యాంకుల్లో ఖాతాలు లేకపోయినా యూపీఐ, నెట్ బ్యాంకింగ్ ద్వారా సులభంగా ఫీజులు చెల్లించవచ్చని స్పష్టం చేసింది.
ఇంటర్నెట్ డెస్క్: సీబీఎస్ఈ (CBSE) వెరిఫికేషన్ (Verification), రీ-వాల్యుయేషన్ (Re-evaluation) కోసం దరఖాస్తు చేసుకునే విద్యార్థులకు ఫీజు చెల్లింపుల విషయంలో బోర్డు కీలక సమాచారం వెల్లడించింది. వెరిఫికేషన్, రీ-ఎవాల్యుయేషన్ పోర్టల్‌లో ప్రస్తుతం పలు బ్యాంకుల చెల్లింపు గేట్‌వేలు అందుబాటులో ఉన్నాయని బోర్డు తెలిపింది.
సీబీఎస్ఈ విడుదల చేసిన ప్రకటన ప్రకారం.. ప్రస్తుతం ఎస్‌బీఐ, కెనరా బ్యాంక్, బ్యాంక్ ఆఫ్ బరోడా, ఇండియన్ బ్యాంకుల పేమెంట్ గేట్‌వేలు పనిచేస్తున్నాయి. అయితే, ఈ బ్యాంకుల్లో విద్యార్థులకు ఖాతాలు ఉండాల్సిన అవసరం లేదని పేర్కొంది. ఆయా బ్యాంకుల్లో ఖాతాలు లేకపోయినా సులభంగా ఫీజులు చెల్లించవచ్చని స్పష్టం చేసింది. యూపీఐ, నెట్ బ్యాంకింగ్, డెబిట్ కార్డు, క్రెడిట్ కార్డు వంటి వివిధ ఆన్‌లైన్ చెల్లింపు పద్ధతుల ద్వారా విద్యార్థులు ఫీజులు చెల్లించవచ్చని తెలిపింది. దరఖాస్తు ప్రక్రియను మరింత సులభతరం చేయడానికి ఈ సదుపాయాలను కల్పించినట్లు సీబీఎస్ఈ పేర్కొంది.
Also Read:
రోజూ ఉడికించిన గుడ్లు తినడం మంచిదేనా?
తెలుగు రాష్ట్రాలు విడిపోయి 12 ఏళ్లయింది.. ఇప్పుడెందుకు ఈ వివాదాలు?: సీఎం చంద్రబాబు