Share News

విరసం సదస్సు

ABN , Publish Date - Jul 03 , 2026 | 12:38 AM

భారతదేశ ఫాసిజానికి దీర్ఘకాలిక స్వభావం ఉన్నట్లే, దాన్ని ఎదుర్కోడానికి దీర్ఘకాలిక కార్యక్రమం కావాలి. అందులో మనుషులందరినీ కలుపుకోగల వైశాల్యం ఉండాలి. సకల స‌మూహాల్లో ప్రతి ఒక్కరినీ ముట్టుకొని కదిలించేంత...

విరసం సదస్సు

భారతదేశ ఫాసిజానికి దీర్ఘకాలిక స్వభావం ఉన్నట్లే, దాన్ని ఎదుర్కోడానికి దీర్ఘకాలిక కార్యక్రమం కావాలి. అందులో మనుషులందరినీ కలుపుకోగల వైశాల్యం ఉండాలి. సకల స‌మూహాల్లో ప్రతి ఒక్కరినీ ముట్టుకొని కదిలించేంత సున్నితంగా ఉండాలి. వాళ్లను రాటుదేల్చేంత పటిష్టంగా ఉండాలి. ఫాసిజాన్ని భారత ప్రజల చరిత్రలోంచి తరిమేయాలంటే వందల వేల రంగాల్లో మోహరించాలి. ముందు ఆ అన్ని రంగాలను సిద్ధం చేయాలి. అందులో ఒకటి సాహిత్యం. కానీ ఫాసిజం రచయితలను కూడా భయపెడుతోంది. నిరాశకు గురిచేస్తోంది. స్వీయ సంరక్షణలోకి తోసేస్తోంది. వీలైనంత జాగ్రత్తగా రాసేలా కుదించివేస్తోంది. వాటిని కూడా ఫాసిస్టులు భరించలేక దాడులు చేస్తున్నారు.

ఇంకోపక్క మానవ జీవితంలోని అన్ని వ్యక్తీకరణలకూ చోటు ఉండాలన్న అనుకూలాంశమే ఫాసిస్టు వ్యతిరేక వైఖరిని పలుచన చేస్తోంది. వీలైనంత వెనక్కి వెళ్ళి, సొంత అనుభవాలకు పరిమితమయ్యేలా చేస్తోంది. అక్కడి నుంచి మెల్లగా మతవాద, మితవాద, సనాతన ధోరణుల వైపు చూపు మళ్లేలా చేస్తోంది. ప్రయోగాలు, కొత్తదనం, వైవిధ్యం కళా సాహిత్యాలను నిరంతరం విస్తరింపచేస్తాయి. కానీ తెలుగు సాహిత్యంలోని సమకాలీన ధోరణులు ఫాసిస్టు వ్యతిరేక ఉద్యమానికి భరోసా ఇవ్వగలవా? పదునైన పరీక్షలో అవి నిగ్గు తేలాల్సి ఉన్నది. ఇలాంటి ఆలోచనా సంఘర్షణలో భాగంగా జూలై 5 ఆదివారం హైద‌రాబాద్‌ సుందరయ్య విజ్ఞానకేంద్రంలో విర‌సం ఆవిర్భావ సదస్సు ఏర్పాటు చేస్తున్నాం. ఇందులో, ‘భార‌త దేశ ఫాసిజం–ప్ర‌త్యేక‌త‌లు’, ‘బుల్డోజ‌ర్ రాజ‌కీయాలు–మ‌త మైనారిటీ అస్తిత్వాల‌పై దాడి’, ‘తెలుగు సాహిత్యంలో ఇటీవ‌లి ధోర‌ణులు–మార్కిస్టు దృక్ప‌థం’ అనే అంశాల‌పై రివేరా, ఎన్‌.వేణుగోపాల్‌, కాశీం, అర‌స‌విల్లి కృష్ణ‌, వేణు, పి.వ‌ర‌ల‌క్ష్మి మాట్లాడతారు. నీట్ ఆత్మ‌హ‌త్య‌ల‌పై ‘క‌ల‌లు –క‌న్నీళ్లు’ పేరుతో విర‌సం క‌ళాకారుల నాటిక ఉంటుంది.

విప్ల‌వ ర‌చ‌యిత‌ల సంఘం

ఇవి కూడా చదవండి

టీ తాగడం మంచిదే.. కానీ ఈ 6 పొరపాట్లు చేస్తే సమస్యలు తప్పవు

కోళ్లు అరుస్తున్నాయని వెళ్లి చూస్తే.. మృత్యువు వెంటాడింది

Updated Date - Jul 03 , 2026 | 12:38 AM