Time as a Living Poem of Experiences: అనుభవాల అంతర్వాహిని
ABN , Publish Date - Jan 01 , 2026 | 06:01 AM
కాలం ఒక కదులుతున్న కావ్యం మనం రాసుకునే అనుభవాల సంతకం రాలిపోయిన ఆకు గతాన్ని గుర్తు చేస్తే...
కాలం ఒక కదులుతున్న కావ్యం
మనం రాసుకునే అనుభవాల సంతకం
రాలిపోయిన ఆకు గతాన్ని గుర్తు చేస్తే
చిగురించిన మొగ్గ రేపటిని తెలియజేస్తుంది
కన్నీళ్లు కడిగేసిన గాయాలన్నీ
రేపటి గెలుపుకు పునాది రాళ్లు
గడియారం ముల్లు తిరుగుతున్న ప్రతిసారీ
జీవితం ఒక పాఠాన్ని నేర్పుతూనే ఉంటుంది
నిన్నటి నిరాశలను నిద్రపుచ్చి
నేటి ఉత్సాహాన్ని ఊపిరిగా మలచుకో
కాలం నీ చేతుల్లో చిక్కుపడని దారం కాదు
నీ సంకల్పంతో నువ్వు నేయాల్సిన అందమైన వస్త్రం
ముగిసిన ఏడాది ఒక అనుభవం
మొదలయ్యే కాలం ఒక అద్భుతం
– పూసపాటి వేదాద్రి
ఇవి కూడా చదవండి
ప్రజలకు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి న్యూ ఇయర్ విషెస్..
వధువుతో పాటు స్నేహితులు కూడా ఏడడుగులు.. ఫన్నీ వీడియో వైరల్..