ఈ వారం వివిధ కార్యక్రమాలు 26 01 2026
ABN , Publish Date - Jan 26 , 2026 | 05:19 AM
మఖ్దూమ్ మొహియుద్దీన్ పురస్కారం, ‘అహానికి ఆవల’ కథా సంపుటి, వెన్నెల సాహితీ పురస్కారం, గ్రంథాలయ ఉద్యమ బస్సు యాత్ర, జన రంజక కవి ప్రతిభా పురస్కారాలు....
మఖ్దూమ్ మొహియుద్దీన్ పురస్కారం
మఖ్దూమ్ మొహియుద్దీన్ జాతీయ పురస్కార (2026) ప్రదాన సభ ప్రభుత్వ సిటీ కళాశాల (హైదరాబాద్) గ్రేట్ హాల్ లో జనవరి 27 ఉ.10.30గంటలకు జరుగుతుంది. పురస్కారాన్ని అఫ్సర్ స్వీకరిస్తారు. అధ్యక్షత కళాశాల ఇంచార్జ్ ప్రిన్సిపాల్ విప్లవ్ దత్ శుక్ల, ముఖ్య అతిథి గోరటి వెంకన్న, అతిథులు కవి యాకూబ్, వేణు ఊడుగుల, కె. ఆనందాచారి, పి. శాంతి. సమన్వయకర్తలు కోయి కోటేశ్వరరావు, జె నీరజ.
మఖ్దూమ్ అవార్డు కమిటి
‘అహానికి ఆవల’ కథా సంపుటి
జి. ఉమామహేశ్వర్ కథా సంపుటి ‘అహానికి ఆవల’ పరిచయ సభ ఫిబ్రవరి 1 ఉ.10.30గంటలకు రవీంద్ర భారతి, హైదరాబాద్‌లో ఉంటుంది. దాసరి అమరేంద్ర, కె.పి. అశోక్ కుమార్ తదితరులు పాల్గొంటారు.
పాలపిట్ట బుక్స్
వెన్నెల సాహితీ పురస్కారం
పై కోసం 2024, 2025 సంవత్సరాల్లో ప్రచురించిన కవితా సంపుటాలు 4 ప్రతులు ఫిబ్రవరి 28లోపు చిరు నామా: పర్కపెల్లి యాదగిరి, ఇం. నెం.17–3–86/35, జ్యోతి నిలయం, వినాయక్ నగర్ రోడ్–2, సిద్ధిపేట– 502375, ఫోన్: 92999 09516కు పంపాలి.
పర్కపెల్లి యాదగిరి
గ్రంథాలయ ఉద్యమ బస్సు యాత్ర
మరో గ్రంథాలయ ఉద్యమాన్ని ప్రజల వద్దకు తీసుకువెళ్లే కార్యక్రమంలో భాగంగా హైదరాబాద్ నుండి అమరావతి వరకు బస్సు యాత్ర జరుగుతుంది. ఫిబ్రవరి 1న హైదరాబాద్ ఉస్మానియా యూనివర్సిటీ వద్ద నుంచి ప్రారంభమయ్యే యాత్రలో మీరు పాల్గొని మరో గ్రంథాలయ ఉద్యమం అభివృద్ధిలో భాగస్వాములు కండి. వివరాలకు: కవి యాకూబ్: 98491 56588, మంచికంటి: 99495 35695.
మంచికంటి
జన రంజక కవి ప్రతిభా పురస్కారాలు
‘రావి రంగారావు సాహిత్య పీఠం’ నిర్వహిస్తున్న జనరంజక కవి ప్రతిభా పురస్కారాలు (2025)కు ఎంపికైన రచనలు ఇళ్ల మురళీధరరావు పద్య సంపుటి ‘శతకాలు’, నాగజ్యోతిశేఖర్ కవితా సంపుటి ‘చిగురించే పేజీలు’, రాధేయ కవితా సంపుటి ‘పావుకోళ్ళు’, కుందుర్తి కవిత కవితా సంపుటి ‘జస్ట్ ఏ హౌస్ వైఫ్’. ఫిబ్రవరి 5 సా.6గంటలకు గుంటూరులోని బృందావన్ గార్డెన్స్ శ్రీ వేంకటేశ్వరస్వామి దేవాలయం అన్నమయ్య కళా వేదిక మీద ఎంపికైన వారికి రూ.3 వేల నగదు, శాలువా, జ్ఞాపికతో సత్కారం ఉంటుంది.
నర్రా ప్రభావతి
ఇవి కూడా చదవండి..
శుభాంశు శుక్లాకు అశోక చక్ర అవార్డు
మీ బ్రెయిన్ రేంజ్‌కు టెస్ట్.. ఈ ఫొటోల్లోని మూడు తేడాలను 21 సెకెన్లలో కనిపెట్టండి