Share News

ఈ వారం వివిధ కార్యక్రమాలు 2-08-2026

ABN , Publish Date - Aug 03 , 2026 | 02:58 AM

సాహితీ పురస్కార సభ, ‘ద్రవిడ’ వ్యాస సంకలనం, సాహిత్య స్వర్ణోత్సవం, ‘పెన్నిధి’ పద్యకావ్యం, ‘తారావళీ సప్తకం’...

ఈ వారం వివిధ కార్యక్రమాలు 2-08-2026

సాహితీ పురస్కార సభ

ఎమ్‌.వి.వి. సత్యనారాయణ స్మారక పురస్కారాలను శేఖరమంత్రి ప్రభాకర్‌, వెంకటమణి స్వీకరిస్తారు. పురస్కార ప్రదాన సభ ఆగస్టు 5 సా.5.30గంటలకు విశాఖ పౌరగ్రంథాలయం, ద్వారకానగర్‌, విశాఖపట్నంలో జరుగుతుంది. అధ్యక్షత అడపా రామకృష్ణ, ముఖ్య అతిథి యార్లగడ్డ లక్ష్మీప్రసాద్‌, ఆత్మీయ అతిథి వి.వి. రమణమూర్తి, ప్రత్యేక అతిథి ద్విభాష్యం రాజేశ్వరరావు.

విశాఖ రచయితల సంఘం

‘తారావళీ సప్తకం’

మూసీ సాహిత్య ధార & మయూఖ అంతర్జాల పత్రిక సం యుక్త ఆధ్వర్యంలో ధూళిపాళ అరుణ రచన ‘తారావళీ సప్తకం’ పుస్తకావిష్కరణ ఆగస్టు 5 సా.6 గంటలకు రవీంద్రభారతి, హైదరాబాద్‌లో జరుగుతుంది. అధ్యక్షత సాగి కమలాకరశర్మ, పుస్తకావిష్కర్త అనుమాండ్ల భూమయ్య, పుస్తక విశ్లేషకులు గన్నమరాజు గిరిజా మనోహరబాబు.

గుడిపాటి

‘ద్రవిడ’ వ్యాస సంకలనం

కె.ఎన్‌. మల్లీశ్వరి, కాత్యాయనీ విద్మహే సంపాదకత్వంలో ‘ద్రవిడ – వివక్షపై దక్షిణ స్వరం’ పుస్తకం ఆవిష్కరణ సభ ఆగస్టు 8 సా. 5.30 గంటలకు దొడ్డి కొమురయ్య హాల్‌, సుందరయ్య విజ్ఞాన కేంద్రం, హైదరాబాద్‌లో జరుగుతుంది. అధ్యక్షత తిరునగరీ దేవకీదేవి, ఆవిష్కర్త ప్రకాష్‌ రాజ్‌, ఆత్మీయ అతిథి ఘంటా చక్రపాణి, సమీక్ష గుంపెనపల్లి సుష్మ.

మలుపు బుక్స్‌

సాహిత్య స్వర్ణోత్సవం

గంటేడ గౌరు నాయుడు సా హిత్య సృజనకు ఐదు దశాబ్దాలు నిండిన సందర్భంగా స్నేహ కళా సాహితి ఆధ్వర్యంలో సాహిత్య స్వర్ణోత్సవ సభ ఆగస్టు 8 ఉ.10 నుండి మన్యం కళావేదిక, ప్రభుత్వ కాలేజీ ప్రాంగణం, పార్వతీపురంలో జరుగుతుంది. ముఖ్య అతిథి కాసిమ్, ఆర్ట్స్ కాలేజీ ప్రిన్సిపాల్, హైదరాబాద్; ఆత్మీయ అతిథిగా అట్టాడ అప్పలనాయుడు.

మల్లిపురం జగదీశ్

‘పెన్నిధి’ పద్యకావ్యం

అబ్జ క్రియేషన్స్ సాహిత్య సాంస్కృతిక సంస్థ, అక్షరకుసుమాలు సంయుక్త ఆధ్వర్యంలో కోడీహళ్ళి ఫణి ప్రసన్న కుమార్ రచన ‘పెన్నిధి’ పద్య కావ్యం ఆవిష్కరణ ఆగస్టు 9 సా.5.30గంటలకు సుందరయ్య భవన్, ప్రగతి నగర్, జె.ఎన్.టి.యు, హైదరాబాద్‌లో జరుగుతుంది. అధ్యక్షత సాదనాల వేంకటస్వామి నాయుడు, ఆవిష్కర్త వింజమూరి విశ్వనాథమయ్య, కావ్య పరిచయం ఆచార్య ఫణీంద్ర.

కోడీహళ్ళి మురళీమోహన్

ఇవి కూడా చదవండి:

దేశానికి ఆడేశా.. ఇక సాధించాల్సింది ఏమీ లేదు: భువనేశ్వర్

ఆసియా కప్ 2026.. హర్మన్‌ప్రీత్ కౌర్ సారథ్యంలో భారత జట్టు ప్రకటన

Updated Date - Aug 03 , 2026 | 02:58 AM