Share News

ఈ వారం వివిధ కార్యక్రమాలు 19-07-2026

ABN , Publish Date - Jul 20 , 2026 | 12:41 AM

మూడు పుస్తకాల ఆవిష్కరణ సభ, వేంపల్లె షరీఫ్‌ కథలపై ప్రసంగం, రెండు తరాల కవి సంగమం, జొన్నవిత్తుల పురస్కారం, ‘అక్షరం’ పురస్కారం, నాగభైరవ పురస్కారం, సాహిత్య పురస్కారాలు, చాసో కథా పురస్కారం

ఈ వారం వివిధ కార్యక్రమాలు 19-07-2026

మూడు పుస్తకాల ఆవిష్కరణ సభ

తెలంగాణ భాషా సాంస్కృతిక శాఖ సౌజన్యంతో పాలపిట్ట, మయూఖ సంయుక్తాధ్వర్యంలో నెల్లుట్ల రమాదేవి పుస్తకం ‘డి. కామేశ్వరి కథల్లో స్త్రీల సంవేదనలు’, కొండపల్లి నీహారిణి రెండు పుస్తకాలు ‘కథా సుజాతం’, ‘అభిమానం’ల ఆవిష్కరణ సభ జూలై 25 సా.6గంటలకు రవీంద్రభారతి, హైదరాబాద్‌లో జరుగుతుంది. సభలో ముదిగంటి సుజాతారెడ్డి, డి.కామేశ్వరి, అమృతలత, శీలా సుభ్రదాదేవి, ఏనుగు నరసింహారెడ్డి, సింగరాజు రమాదేవి, దేవులపల్లి వాణి, దూళిపాళ అరుణ, గుడిపాటి ప్రసంగిస్తారు.

పాలపిట్ట బుక్స్‌

వేంపల్లె షరీఫ్‌ కథలపై ప్రసంగం

రాజాం రచయితల వేదిక 138వ సమావేశం జూలై 26 ఉ.10గంటలకు విజయనగరం జిల్లా రాజాంలో గల విద్యానికేతన్‌ పాఠశాలలో జరుగుతుంది. సభలో ‘వేంపల్లె షరీఫ్‌ కథల్లో సమాజం’ అంశంపై రాజాపు శాంతారావు ప్రసంగిస్తారు. సభకు మూడడ్ల శ్రీనివాసరావు అధ్యక్షత వహిస్తారు. వివరాలకు ఫోన్‌: 98857 58123.

గార రంగనాథం

రెండు తరాల కవి సంగమం

రెండు తరాల కవి సంగమం సీజన్‌ 2, సిరీస్‌ 46 కార్యక్రమం ఆగస్ట్‌ 8 సా.6గంటలకు శ్రీకృష్ణదేవరాయ తెలుగు భాషా నిల యం, సుల్తాన్‌ బజార్‌, కోఠి, హైదరాబాద్‌లో జరుగుతుంది. బెల్లి యాదయ్య, రోహిణి వంజారి, జాబేర్‌ పాషా, ప్రమోద్‌ వడ్లకొండ, ఎస్‌ఎస్‌ తరుణ్‌ పాల్గొంటారు.

యాకూబ్‌

జొన్నవిత్తుల పురస్కారం

జొన్నవిత్తుల రామకృష్ణ శర్మ, శ్రీమతి లక్ష్మీ నరసమ్మ దంపతుల జ్ఞాపకార్థం జొన్నవిత్తుల సాహిత్య స్ఫూర్తి పురస్కారాన్ని హైదరాబాద్‌కు చెందిన పరిమి శ్రీరామనాథ్‌ స్వీకరిస్తారు. సెప్టెంబర్ 6న పలమనేరులోని తెలుగు సాహిత్య సాంస్కృతిక సమితి కళామందిరంలో రూ.25వేల నగదుతో పాటు శాలువా, జ్ఞాపికతో సత్కారం ఉంటుంది. జొన్నవిత్తుల శ్రీరామచంద్రమూర్తి, బాలాజీ, పుష్ప, మాధవరెడ్డి తదితరులు పాల్గొంటారు.

పి. తులసినాథం నాయుడు'

‘అక్షరం’ పురస్కారం

‘అక్షరం’ లిటరరీ ట్రస్ట్, కర్నూలు ఏటేటా ఇచ్చే పురస్కారాల్లో భాగంగా ఈ సంవత్సరం పురస్కారాన్ని కవి అనిల్ డానీ స్వీకరిస్తారు. పురస్కార సభ ఆగష్టు 8న కర్నూలులో జరుగుతుంది. కవికి రూ.25వేల నగదు మొమెంటోతో సత్కారం ఉంటుంది.

జి. వెంకటకృష్ణ

నాగభైరవ పురస్కారం

నాగ భైరవ సాహిత్య పురస్కారం కోసం ఎంపికైన బాలసాహిత్యం: పేట యుగంధర్‌ నవల ‘జాను అనే నేను–నా స్నేహితురాళ్ళు’, మాచిరాజు కామేశ్వరరావు కథా సంపుటి ‘సూర్యచంద్రులు’, చింతల శ్రీనివాస గుప్త గేయ సంపుటి ‘చిగురింతలు’. ఆగస్ట్‌ 16న ఒంగోలులో పురస్కార ప్రదానం జరుగుతుంది.

నాగభైరవ ఆదినారాయణ


సాహిత్య పురస్కారాలు

గుంటూరు జిల్లా రచయితల సంఘం సాహిత్య పురస్కారాలకు స్వర్ణ కిలారి కథా సంపుటి ‘గోడవతల’, విజయ్ కోగంటి కవిత్వ సంపుటి ‘ఎవరిదీ చూపు’ ఎంపికయ్యాయి. త్వరలో గుంటూరులో జరగబోయే సభలో వారికి చెరో 5వేల నగదు, జ్ఞాపికలతో పురస్కార ప్రదానం ఉంటుంది. వివరాలకు: 9490776184.

సి. భవానీదేవి

చాసో కథా పురస్కారం

చాసో కథా పురస్కారం & చాగంటి తులసి అను వాద పురస్కారాల ప్రదానం ఆగస్ట్ 2 ఉ.10 గంటలకు విజయనగరంలో జరుగుతుంది. కథా పురస్కారాన్ని చింతా అప్పలనాయుడు (‘నకజనకరి... నాం...నాం...’), అనువాద పురస్కారాన్ని స్వర్ణ కిలారి (‘లిప్తకాలపు స్వప్నం’) స్వీకరిస్తారు.

జి.ఎస్‌.చలం

ఇవీ చదవండి:

'మేడ్ ఇన్ ఇండియా' సీ-295.. ఆత్మనిర్భర్ భారత్‌కు ఊతం

యూసీసీ బిల్లుకు మధ్యప్రదేశ్ కేబినెట్ ఆమోదం.. త్వరలో అసెంబ్లీకి!

Updated Date - Jul 20 , 2026 | 12:41 AM