ఈ వారం వివిధ కార్యక్రమాలు 16 03 2026
ABN , Publish Date - Mar 16 , 2026 | 01:38 AM
కుసుమ ధర్మన్న అవార్డుల ప్రదానోత్సవం, ‘అనేక’ ఉగాది సాహిత్య సంచిక ఆవిష్కరణ, ‘కడపటి యుద్ధం’ నవల ఆవిష్కరణ, ప్రపంచ కవితా దినోత్సవసభ, ‘చేతనాకేతనం’ పద్య కవితా సంపుటి, కళింగాంధ్ర లిటరేచర్ ఫెస్టివల్, ఫైజ్ కవిత్వ పరిచయ సభ...
కుసుమ ధర్మన్న అవార్డుల ప్రదానోత్సవం
కుసుమ ధర్మన్న కళా పీఠం రెండు తెలుగు రాష్ట్రాలకు ప్రకటించిన అవార్డులను తెలంగాణకు జయరాజ్, ఆంధ్రప్రదేశ్‌కు బండి సత్యనారాయణ ఎంపికయ్యారు. ప్రదానోత్సవం కుసుమ ధర్మన్న జయంతి మార్చి 17న ఉ.10గంటల నుంచి ప్రకృతి వేదిక, రాజమండ్రిలో పూర్వ పార్లమెంట్ సభ్యులు జి. హర్షకుమార్ నేతృత్వంలో జరుగుతుంది
రాధ కుసుమ
‘అనేక’ ఉగాది సాహిత్య సంచిక ఆవిష్కరణ
దాదాపు 115 మంది కవులు, కథకులు, విమర్శకులు, వాగ్గేయకారుల రచనలు ఇంటర్వ్యూలతో, ఐదుగురు ఆర్టిస్టుల బొమ్మలతో 208 పేజీల ఉగాది ప్రత్యేక సంచిక ఆవిష్కరణ సభ మార్చి 17 ఉ.11 గం.లకు హైదరాబాద్, బేగంపేటలోని టూరిజం ప్లాజా హోటల్‌లో జరుగుతుంది. ఆవిష్కర్త కె.శ్రీనివాస్; ముఖ్య అతిథి అల్లం నారాయణ; విశిష్ట అతిథులు గోరటి వెంకన్న, కొండవీటి సత్యవతి, పసునూరి రవీందర్, వేణు ఊడుగుల. సభాధ్యక్షత సమయమంత్రి చంద్రశేఖర శర్మ, నిర్వహణ స్కైబాబ, సంచిక సమీక్ష ఎ.కె. ప్రభాకర్.
శ్రీజనచైతన్య పబ్లికేషన్స్
‘కడపటి యుద్ధం’ నవల ఆవిష్కరణ
బండి నారాయణ స్వామి ‘కడపటి యుద్ధం’ చారిత్రక నవల ఆవిష్కరణ మార్చి 22ఉ.10గంటలకు ఎన్.జి.ఒ.హోమ్, అనంతపురంలో జరుగుతుంది. గోరటి వెంకన్న, భూమన్, అంబటి సురేంద్ర రాజు, లక్ష్మీనరసయ్య, నాగోలు కృష్ణారెడ్డి తదితరులు పాల్గొంటారు.
‘స్పందన’ అనంత కవుల వేదిక
ప్రపంచ కవితా దినోత్సవసభ
కవిసంధ్య, తెలంగాణ భాషా సాంస్కృతిక శాఖ సౌజన్యంతో మార్చి 22 సా.5.30కు రవీంద్ర భారతి, హైదరాబాద్‌లో ప్రపంచ కవితా దినోత్సవాన్ని నిర్వహిస్తోంది. ఈ సందర్బంగా కవి సంధ్య 59 – చందు సుబ్బారావు ప్రత్యేక సంచిక ఆవిష్కరణ, ‘తెలుగులో యుద్ధ కవిత్వం’పై కోయి కోటేశ్వరరావు ప్రత్యేక ప్రసంగం, కవి సంధ్య – సుధామ కవితల పోటీ బహుమతుల ప్రదానం ఉంటాయి. కె. శివారెడ్డి, జింబో, ఏనుగు నరసింహా రెడ్డి, సుధామ తదితరులు పాల్గొంటారు. వివరాలకు: 98482 02526.
శిఖామణి
‘చేతనాకేతనం’ పద్య కవితా సంపుటి
నన్నయభట్టారక పీఠం ఆధ్వర్యంలో రసరాజు పద్యకవితా సంపుటి ‘చేతనాకేతనం’ ఆవిష్కరణ మార్చి 21సా.6గంటలకు తణుకు – సజ్జా పురంలోని శ్రీ రామకృష్ణ సేవాసమితి భవనంలో జరుగుతుంది. ఆవిష్కర్త గజల్ శ్రీనివాస్, అధ్యక్షత జొన్నలగడ్డ సూర్యసుబ్రహ్మణ్యం, ముఖ్య అతిథి ఆరిమిల్లి రాధాకృష్ణ, విశిష్ట అతిథి గుమ్మడి గోపాలకృష్ణ.
కొల్లి రామచంద్రశర్మ
కళింగాంధ్ర లిటరేచర్ ఫెస్టివల్
కళింగాంధ్ర లిటరేచర్ ఫెస్టివల్ పేరుతో మార్చి 29న విశాఖపట్నం, పబ్లిక్ లైబ్రరీలో ఒక రోజంతా కళింగాంధ్ర సాహిత్యకారులంతా కూర్చుని, చర్చించే కార్యక్రమం జరుగుతుంది. కె. ఎస్. చలం, అట్టాడ అప్పలనాయుడు, వి.వి. రమణమూర్తి మెంటార్లుగా వ్యవహరిస్తున్న ఈ ఫెస్టివల్‌లో– ‘కళింగాంధ్ర చరిత్ర రచన’, ‘తెలుగు కథ నుంచి కళింగాంధ్ర కథ ఏమి నేర్చుకుంది? ఏమి నేర్పించింది?’ ‘వర్తమాన తెలుగు సాహిత్య విమర్శ’, ‘తెలుగు నవల, కవిత్వం ప్రస్థానంలో కళింగాంధ్ర ప్రమేయం, ప్రభావం’ తదితర అంశాలపై ప్యానెల్ డిస్కషన్లు ఉంటాయి. వివరాలకు: 99892 65444.
దుప్పల రవికుమార్
ఫైజ్ కవిత్వ పరిచయ సభ
జి.ఎన్. సాయిబాబా అనువదించిన ఫైజ్ అహ్మద్ ఫైజ్ కవితా సంపుటి పరిచయ సభ మార్చి 22 సాయంత్రం యుటిఎఫ్ హోమ్, కాకినాడలో జరుగుతుంది. ఖాదర్, శ్రీరాం పుప్పాల, రాందేవ్, అరసవిల్లి కృష్ణ, ప్రభు, కె. రవిచందర్ పాల్గొంటారు. మాజీ ఎమ్మెల్సీ వెంకటేశ్వరావు సభాధ్యక్షత వహిస్తారు.
హోరు

ఇవి కూడా చదవండి:
వామ్మో దారుణం.. ఈ ఏనుగు ఎలా దాడి చేసిందో చూడండి..
డుడుమ జలపాతం అందాలకు ఆనంద్ మహీంద్రా ఫిదా